twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్రిదా పింటో పై తెలుగు హీరో కన్ను

    By Staff
    |

    Freida Pinto
    'స్లమ్ డాగ్' లో లతిక పాత్ర పోషించిన ఫ్రిదా పింటో పై ఓ తెలుగు యంగ్ హీరోకు కన్ను పడింది. ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే..తన చిత్రం డేట్స్ ఇస్తానని ప్రపోజల్ పెట్టాడు. దాంతో కెరీర్ ప్రారంభంలో తప్ప హిట్ అనేది లేకుండా ఉన్న ఈ హీరోకి ఈ ఆశ పుట్టడం వెనక కారణం అన్వేషిస్తున్నారు. అయితే తనకి ఏ దురుద్దేశం లేదని, కేవలం తమ సినిమా మార్కెట్ ని పెంచటానికే అలా కోరుతున్నానని, అలాగే ఆమెను తీసుకుంటే రెమ్యునేషన్ చాలా భాగం తగ్గించుకుంటానని చెప్పాడని సమాచారం. ఆ నిర్మాత తన మిత్రులతో ఈ విషయం చెప్పుకుని, ఏదో వాళ్ళ నాన్ని ఫైనాన్స్ చేస్తాడని, రిలీజ్ కు ఇబ్బంది ఉండదని వీడి వెనక పడుతున్నాం కానీ, వీడికి అంతర్జాతీయ మార్కెట్ కూడానా అని వెటకారం చేసాడని చెప్తున్నారు. అలాగే మొన్న రిలీజైన సినిమాలోనూ తన నటనను ప్రక్కన పెట్టి హీరోయిన్ ని బాగా చూపెట్టండి, ఐటం సాంగ్ కి ఫలానా వాళ్ళని తీసుకురండి అని హంగామా చేసాడు.ఏమైంది...ఒక్కషోనే పడింది..వీళ్ళు మారరు...వీళ్ళకు ప్రిధా పింటో కావాలా అని చెప్పుకుని నవ్వుకున్నారు.

    ఇక 'స్లమ్ డాగ్' లతిక హాలివుడ్ లో అడుగు పెట్టడానికి సిద్ధమైపోయింది. ఆమెను తీసుకున్న అలాంటిలాంటి వ్యక్తి కాదు. ఒకప్పటి మేటి హాస్య నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వుడీ అలెన్. ఎడతెరిపి లేని టెలివిజన్ ఇంటర్వ్యూలతో బిజీగా వున్న ఫ్రిదా పింటో మరో అడుగు ముందుకేసి, వుడీ అలెన్ హీరోయిన్ అయిపోతోంది. ఇరవై నాలుగేళ్ల ఈ ముంబాయి అమ్మాయి కెరీర్ లో ఈ చిత్రం అత్యద్భుతమైన బ్రేక్ త్రూ కానుంది. ఆదివారం ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్న అనంతరం ప్రసంగిస్తూ తనకు ఈ అవకాశం కల్పించిన వుడీ అలెన్ కు విశేషంగా ధన్యవాదాలు చెప్పుకుంది ఈ సుందరి. వుడి అలెన్..వాటేవర్ వర్క్స్ అనే చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఆ తరువాత అతడు నిర్మించబోయే, ఇంకా పేరు పెట్టని సినిమా జూలైలో సెట్లకు వెళ్లనుంది. దీనిలో ఫ్రిదా పింటో కు నటీ నటులు సర్ ఆంథోని హాప్ కిన్స్, జోష్ బ్రోలిన్ వంటి వారు నటిస్తున్నారు. అలాంటి ఆమెను మన హీరో తన ప్రక్కన చేయాలని పట్టుబడుతున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X