అతనికే నా ఓటు.. అల్లు అర్జున్‌ని ఒప్పించే ప్రయత్నంలో సుకుమార్!

ఇటీవలే అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం తన 20వ ప్రాజెక్టును సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 'రంగస్థలం' తర్వాత గ్యాప్ తీసుకున్న సుకుమార్ ఈ సినిమా కోసం బలమైన స్క్రిప్ట్ రెడీ చేసి రంగంలోకి దిగారు.

పైగా అల్లు అర్జున్‌తో తాను చేయబోతున్న మూడో సినిమా కావడంతో హాట్రిక్ సాధించాలని కసితో ఉన్నారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఈ మేరకు నటీనటులు మొదలుకొని, సాంకేతిక వర్గం వరకు అందరినీ సెలెక్టెడ్ గా ఎంపిక చేస్తున్నారట సుక్కు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ ఆలోచనలు వేరు వేరుగా ఉన్నాయని తెలుస్తోంది.

AA20: Sukumar Plans To Change Allu Arjuns Thought

'అల.. వైకుంఠపురములో' మ్యూజిక్ గ్రాండ్ సక్సెస్ చేసిన థమన్ కావాలని అల్లు అర్జున్ భావిస్తుండగా, తనకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ కావాలని సుకుమార్ అనుకుంటున్నారట. ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్‌ని ఒప్పించే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. సో చూడాలి మరి చివరకు ఏ సంగీత మాంత్రికుడు ఫైనల్ అవుతాడో!.

ఇక ఈ సినిమా ఇతర వివరాలు చూస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న వైవిద్యభరితమైన కథాంశం అని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X