AA23: అల్లు అర్జున్ కోసం ప్రభాస్ హీరోయిన్.. లోకేష్ మార్క్ మాసివ్ ప్లాన్ ఇదేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా మూవీతో దూసుకపోతున్నారు. ఆ క్రమంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. #AA23గా ఇది ప్రచారంలో ఉంది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ సినిమా అప్పుడే సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్ పై తాజాగా ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ చేయబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు?
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సుమారు సగం పూర్తైనట్లు సమాచారం. సమ్మర్‌లో ఆ ప్రాజెక్ట్‌ను ముగించి, చిన్న బ్రేక్ తర్వాత లోకేష్‌తో సినిమా ప్రారంభించాలనే ప్లాన్‌లో ఉన్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో #AA23 ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ బిజీగా ఉండగా, కాస్టింగ్‌పై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

అందులో భాగంగానే శ్రద్ధా కపూర్ పేరు ముందుకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'స్త్రీ 2'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న శ్రద్ధా, పాన్-ఇండియా మార్కెట్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ మూవీ సాహో ద్వారా పరిచయమే. ఇప్పుడు అల్లు అర్జున్‌తో తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. ఈ ప్లాన్ సెట్ అయితే.. హిందీ- తెలుగు- తమిళ మార్కెట్లలో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయని ఇండస్ట్రీ టాక్. అయితే, ఇది ఇంకా అధికారిక ప్రకటన కాదని, ఇన్‌సైడర్ రిపోర్టుల ఆధారంగానే ప్రచారం జరుగుతోంది.
ఇక కథ విషయానికి వస్తే, లోకేష్ ఈ సినిమాను తన "డ్రీమ్ ప్రాజెక్ట్"గా భావిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కథ సూపర్ పవర్స్ టచ్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని, అల్లు అర్జున్ ప్రత్యేకమైన గెటప్ కనిపించబోతున్నారట. ఇది నిజమైతే, బన్నీ కెరీర్‌లో మరో మైల్ స్టోల్ క్యారెక్టర్ గా మారబోతుందని అంచనా. సంగీతం విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తోంది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ సినిమాకు భారీ హైప్ నెలకొన్నాయి. నిర్మాణ బాధ్యతలు టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంటోంది. పాన్-ఇండియా స్కేల్‌కు తగిన భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నట్లు సమాచారం.
ఇలా ఈ భారీ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్, అనిరుధ్ సంగీతం, శ్రద్ధా కపూర్ (రూమర్) లాంటి విషయాలు కలిసి వస్తే, ఇది నిజంగానే భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది. అయితే హీరోయిన్ ఎంపికపై మేకర్స్ నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ వార్తలను రూమర్‌గా తీసుకోవాలని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. ఒకవేళ కన్ఫర్మేషన్ వస్తే, ఈ ప్రాజెక్ట్ అటు నార్త్ .. ఇటు సౌత్ మార్కెట్లను ఒకేసారి షేక్ చేయడం ఖాయం.


Click it and Unblock the Notifications











