'సుకుమారుడు' ఆది నెక్ట్స్ చిత్రం ఖరారు
హైదరాబాద్ : రీసెంట్ గా 'సుకుమారుడు' తో డిజాస్టర్ సొంతం చేసుకున్న ఆది మరో చిత్రం కమిటయ్యినట్లు సమచారం. శ్రీను వైట్ల శిష్యుడు ఉపేంద్ర మాధవ్ కథ ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఉపేంద్రమాధవ్ గత కొంతకాలంగా శ్రీనువైట్ల సినిమాలకు అసోసియేట్ గా పనిచేస్తున్నారు.
ఇక సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై ఆది(సాయికుమార్ కొడుకు) హీరోగా కె. వేణుగోపాల్ నిర్మించిన చిత్రం 'సుకుమారుడు'. 'పిల్ల జమీందారు' ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
సినిమా చాలా కన్ఫూజన్ గా ఉందని, ఒక సీన్ కు మరో సీన్ కు లింక్ లేకుండా పోయిందని, లెంగ్త్ ఎక్కువైందని అందరూ అన్నారు. ఈ నేపధ్యంలో సుకుమారుడు లెంగ్త్ తగ్గించారని సమాచారం. అయినా వీకెండ్స్ లో కూడా కలెక్షన్స్ లేకుండా పోయాయి. దాంతో సినిమాని కొనుక్కున్న వాళ్లంతా పూర్తి లాస్ అని ఫిక్స్ అయిపోయారు.
గతంలో వచ్చిన ఆది చిత్రాలు లవ్లీ,ప్రేమే కావాలి కూడా పెద్దగా ఆడలేదు. అయినా ధైర్యం చేసి నిర్మాతలు దాదాపు ఏడున్నర కోట్ల రూపయాల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందే మూడున్నర కోట్ల డెఫిషిట్ అని, రిలీజ్ అయ్యాక పైసా వెనక్కి రాదని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











