నాని ఫిక్సయ్యాడు.. ఆదినే దొరకడం లేదు.. తల పట్టుకుంటున్న డైరెక్టర్

నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'నిన్ను కోరి'. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రీన్‌ ప్లే వర్క్ చేశారు.

2017లో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో నాని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు, నివేదా, ఆది కూడా అద్భుతమైన హావభావాలతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ అత్యధిక వసూళ్లను రాబట్టింది.

ఇటీవలే రెండు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హక్కులను ప్రముఖ తమిళ దర్శకుడు కన్నన్‌ తీసుకున్నారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఆయన పని చేస్తున్నారు. తమిళ నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేస్తున్నారు. అలాగే, ఇందులో నాని పాత్ర కోసం కోలీవుడ్ యంగ్ హీరో అధర్వను తీసుకోగా, నివేదా పాత్రకు అనుపమ పరమేశ్వరన్‌ను ఫైనల్ చేశారు.

Aadhi Pinisetty character not Fix For Nanis Ninnu Kori tamil remake

అయితే, సినిమాలో అత్యంత ముఖ్యమైన ఆది పినిశెట్టి పాత్రకు మాత్రం ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ పాత్రకు కొత్త వాళ్లను తీసుకుందామనుకుని, ఇప్పటికే దర్శకుడు కొంత మందిని ఆడిషన్స్ కోసం పిలిపించినా, వాళ్లెవరూ ఆయనను మెప్పించలేదని తెలిసింది. దీంతో పాత వారినే తీసుకోవాలని చూస్తున్నారట. ఇందుకోసం కొంత మంది నటులతో చర్చలు జరపాలని డిసైడ్ అయ్యారట దర్శకుడు కన్నన్.

ఈనెల 15వ తేదీ లోపు ఎవరో ఒకరిని ఫైనల్ చేసేసి షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, షూటింగ్ ప్రారంభమైన వెంటనే ఏకధాటిగా అమెరికా, స్విట్జర్లాండ్‌ దేశాలలో చిత్రీకరణ జరుపనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ షణ్ముగసుందరం అందించనుండగా, మసాలా పిక్స్‌, ఎంకేపీపీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ ఎంపిక జరగాల్సివుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X