Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆది పినిశెట్టి ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడా.. ఫొటో ద్వారా బయటపడ్డ ఎఫైర్?
సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి అంటే తెలుగులోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఫీల్ గుడ్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన తనయుడు ఆది పినిశెట్టి ఒకవైపు హీరోగా ట్రై చేస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్టార్ యాక్టర్ డేటింగ్ లో ఉన్నాడని టాక్ వస్తోంది. ఇటీవల ఒక ఫోటో బయటపడటం వల్ల సోషల్ మీడియాలో కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.
ఆ పాత్రలతోనే క్రేజ్ పెరిగింది..
మొదట హీరోగా అడుగులు వేసిన ఆది పినిశెట్టి ఆ తరువాత హీరోగా కంటే కూడా సపోర్టింగ్ రోల్స్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రంగస్థలం, నిన్నుకొరి వంటి సినిమాల్లో ఆది చేసిన పాత్రలకు మంచి ప్రశంసలు దక్కాయి. అనంతరం సరైనోడు సినిమాలో చేసిన విలన్ పాత్ర మనోడికి మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది.
హీరోయిన్‌తో డేటింగ్..
చాలా రోజుల తరువాత ఆది ప్రేమలో ఉన్నాడని రూమర్స్ వస్తుండడం వైరల్ గా మారింది. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు. ఆది పినిశెట్టితో 2017 నుంచి క్లోజ్ గా ఉంటున్న బెంగుళూరు హీరోయిన్ నిక్కీ గల్రానీ. వీరిద్దరి కలయికలో మరకతమని, మలుపు అనే సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమా కారణంగా వీరిపై పెద్దగా రూమర్స్ వచ్చింది లేదు.
బయటపడిన ఫోటో..
ఆ మధ్య తమిళ్ మీడియాలో ఆది ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు సందర్భంగా బయటపడిన ఒక ఫొటోలో నిక్కీ గల్రానీ దర్శనమిచ్చింది. కరోనా వైరస్ కారణంగా పార్టీకి ఇండస్ట్రీలో ఎవరిని ఇన్వైట్ చేయలేదు.
ఫ్యామిలీ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్
ఆది పినిశెట్టి కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే తండ్రి పుట్టినరోజు పార్టీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక నిక్కీ గల్రానీ కూడా పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదిపై ఇప్పటికే వస్తున్న రూమర్స్ కి ఈ ఫోటో మరింత బూస్ట్ ఇచ్చినట్లయ్యింది. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ఇప్పటి వరకు పినిశెట్టి ఫ్యామిలీ ఏలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు విషయం తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.