పెళ్ళికి సిద్ధమైన మరో టాలీవుడ్ హీరో.. ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో.. త్వరలో శుభవార్త?
సినీ పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. ఇప్పటికే చాలా మంది నటీనటులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా చేసుకున్నవారు కొంతమంది హ్యాపీగా కాపురాలు చేసుకుంటుంటే మరికొందరు విడాకుల బాట పడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా ఒక హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఆ వివరాలు

రవిరాజా పినిశెట్టి వారసుడిగా
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో కమర్షియల్ హీరోగా రాణిస్తూనే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్నారు. విలన్‌గా కూడా మెప్పిస్తున్నారు. 'రంగస్థలంలో కుమార్ బాబు అనే పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన ఆది.. ఆ తర్వాత 'నీవెవరో', 'యూటర్న్' చిత్రాల్లో నటించారు.

సంజన గల్రాని సోదరి
సునీల్ సరసన కృష్ణాష్టమి సినిమాలో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానితో ఆది ప్రేమలో ఉన్నాడని అంటున్నారు. సంజన గల్రాని సోదరి అయిన నిక్కీ గల్రాని సౌత్ లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో నిక్కీ గల్రాని.. సునీల్ సరసన కృష్ణాష్టమి, ఆది పినిశెట్టి సరసన మలుపు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో నిక్కీ గల్రాని పెద్దగా పాపులర్ కాలేదు కానీ తమిళంలో ఆమె ఎక్కువ సినిమాలు చేసింది.

త్వరలోనే నిశ్చితార్థం
ఆది పినిశెట్టి-నిక్కీ కలిసి రెండు సినిమాల్లో నటించారు. అవి తెలుగులో మలుపు, మరకత మణి.. పేరుతో డబ్ అయ్యాయి కూడా. ఇక ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ ఉండగానే ఇప్పటివరకు వీరి ప్రేమ విషయం మీద వీరిద్దరూ నోరు విప్పింది లేదు. అయితే తాజాగా ఆది సన్నిహిత బంధువు ద్వారా ఆది, నిక్కీ ల వివాహానికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారని, త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది.

‘క్లాప్' సినిమాతో
ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా నిక్కీ గల్రాని.. ఆది పినిశెట్టి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా హాజరవుతోంది అని అంటున్నారు. దానికి ఊతం ఇచ్చే విధంగానే ఆ మధ్య వీరిద్దరూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కూడా జంటగా కూడా కనిపించారు. ఆది చివరిగా నగేష్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి', కొత్త దర్శకుడు పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో 'క్లాప్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ది వారియర్ లో విలన్ పాత్రలో
ప్రస్తుతానికి అయితే ఆది రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక నిక్కీ గల్రాని విషయానికి వస్తే ప్రస్తుతం తమిళం, మలయాళంలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. వివాహం తర్వాత ఆమె నటన కొనసాగిస్తుందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది


Click it and Unblock the Notifications











