తొక్కుడు బిళ్ల ఆడతాడంట

By Srikanya

హైదరాబాద్: లవ్ లీ చిత్రం కాంబినేషన్ ఆది, బి.జయ లను రిపీట్ చేస్తూ మరో ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి తొక్కుడు బిళ్ళ అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బి.జయ కథని హీరోకి నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా రాకుల్ ప్రీతి సింగ్ ని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ప్రముఖ పి.ఆర్.ఓ బి.ఎ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉంది.

ఆది చిత్రాల విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో అతనికి సరైన హిట్ కాలేదు. కొద్ది కాలం విడుదలైన ‘గాలిపటం' అనుకున్నట్లుగా ఆకట్టుకోలేకపోయింది. ఇది కాకుండా ఆది నటించిన లవ్ అండ్ మాస్ ఎంటర్టైనర్ ‘రఫ్' కూడా త్వరలో రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్దం చెసుకుంటున్నాడు.

Aadi-B.Jaya teams up again

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆది కూడా ఫస్ట్ హాఫ్ కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసాడు. మరీ కొద్ది రోజుల్లో సెకండాఫ్ కి సంబందించిన డబ్బింగ్ ని కూడా పూర్తి చేయనున్నాడు. ఆది ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. ఆది సిక్స్ ప్యాక్ క్లైమాక్స్ ఫైట్ లో ఉంటాయని సమాచారం.

ఈ మూవీలో ఆది సరసన రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేస్తుండగా, ఓ కీలక పాత్రలో శ్రీ హరి కనిపించనున్నారు. సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అభిలాష్ మాధవరం నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X