Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హీరో సిద్దార్థ స్థానంలో ‘సుకుమారుడు’గా ఆది
హీరో సిద్దార్థ 'సుకుమారుడు' అనే చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి సిద్ధార్థ తప్పుకున్నాడు. డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్లనే అతడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధార్థ స్థానంలో హీరో ఆదిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని కె. వేణుగోపాల్, కెవివి సత్యనారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉంది.
కాగా...ఆది ప్రస్తుతం 'లవ్ లీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. బి.జయ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శాన్వి ఆది సరసన రొమాన్స్ చేస్తున్నారు. బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈచిత్రం ఈ నెల చివరి వారంలో గానీ, ఏప్రిల్ నెలలోగానీ విడుదలయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబు చేతుల మీదుగా ఇటీవల ఆడియో విడుదల చేశారు. పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.