ఇదీ ఫ్లాప్ అయితే బాబు షెడ్డుకే
హైదరాబాద్ : మినిమం గ్యారెంటీ హీరోగా ముద్రపడకపోతే ఆ హీరో కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అలాగని మినిమం గ్యారెంటీ హీరోగా ముద్రపడటమనేది మామూలు విషయం కాదు. నాలుగైదు సినిమాలన్నా మంచి విజయం సాధిస్తే...రెండు మూడు హిట్స్ వచ్చినా, ఈ సారి ఖచ్చితంగా హిట్ ఇస్తాడులే అని అంచనాలు పెట్టుకుంటారు. అలా కాకుండా కెరీర్ ప్రారంభం నుంచీ ఫ్లాఫ్ ముద్రతో ప్రయాణం పెట్టుకుంటే ఇక ఇంతే సంగతలు. ప్రతీ సినిమా లిట్మస్ టెస్టే. ఇప్పుడు అలాంటి పరిస్ధితిని ఎదుర్కొంటున్నాడు యంగ్ హీరో ఆది.
సాయికుమార్ కొడుకు ఆది కెరీర్ ప్రారంభం నుంచి మంచి హిట్ అనేది పడలేదు. ఆడించిన సినిమాలే కానీ జెన్యూన్ గా ఆడినవి లేవు. దాంతో ఆయన తాజా చిత్రం 'ప్యార్ మే పడిపోయానే' ఏ మాత్రం తేడా కొట్టినా ఇక ఆయన కెరీర్ కష్టమే అంటున్నారు. ఆది, శాన్వి జంటగా నటించిన సినిమా'ప్యార్ మే పడిపోయానే'. కె.కె.రాధామోహన్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ తెరకెక్కించింది. రవిచావలి దర్శకత్వం వహించారు. మే 16 న ఈ చిత్రం విడుదల అవుతోంది.

నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ "మా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులన్నీ పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. మంచి లవ్ ఫీల్‌తో తెరకెక్కిన సినిమా ఇది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆది, శాన్వికి 'లవ్‌లీ' తర్వాత 'ప్యార్ మే పడిపోయానే' మంచి హిట్ సినిమా అవుతుంది. అనూప్ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది. మా సంస్థలో ఇది చాలా పెద్ద హిట్ సినిమా అవుతుంది'' అని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.కుమార్ మాట్లాడుతూ...ఆది పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం ఆది కెరీర్లో మరో సూపర్ హిట్ అవుతుంది. మా బేనర్లో వస్తున్న మరో మంచి చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఈ చిత్రం. అనూపర్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అవుతుంది' అన్నారు.
ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, సప్తగిరి, మధు, నరసింహ, పృథ్వి, గురురాజ్, సత్యకృష్ణ, అనంత్, సంధ్యా ఝనక్, మాధవి సిద్ధం, విష్ణుప్రియ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి.రమణ, కెమెరా: టి.సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, నిర్మాత: కె.కె. రాధామోహన్, రచన-దర్శకత్వం: రవిచావలి.


Click it and Unblock the Notifications











