డజన్ ఫ్లాప్ సినిమాలు..అయినా వరుస ఆఫర్స్, ఎలా చెప్మా ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ఇక ఆ హీరో కెరీర్ ముగిసిపోయింది అని అందరూ భావిస్తారు. కానీ తెలుగులో ఇప్పుడు దాదాపు 12 ఫ్లాప్ సినిమాలు అందుకున్నా మళ్లీ మళ్లీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి ఆది సాయి కుమార్ కి. కెరీర్ మొదట్లో ప్రేమ కావాలి ఆ తర్వాత చేసిన లవ్లీ సినిమాలు మాత్రమే ఆది కి సక్సెస్ ఇచ్చాయి. ఆ తర్వాత ఆయన వరుసగా చేసిన సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే, గాలిపటం, రఫ్, చుట్టాలబ్బాయి, శమంతకమణి, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, ఈ మధ్య రిలీజ్ అయిన శశి. ఇలా దాదాపు 12 సినిమాలు ఫ్లాప్స్ అందుకున్నాక కూడా ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు అంటే సాహసమనే చెప్పాలి.

ప్రస్తుతానికి ఆయన హీరోగా మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి తమిళ తెలుగు మల్టీ లింగ్యువల్ సినిమా కావడం గమనార్హం. ఆది హీరోగా జంగ్లీ అనే పేరుతో తెలుగు తమిళ సినిమా ఒకటి ప్రొడక్షన్ లో ఉంది. అలాగే ఆ మధ్య ఫ్లాప్ డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో కూడా ఒకటి అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగానే తాజాగా నిన్న మరో సినిమా అనౌన్స్ చేశాడు ఆది. అవికా గోర్ హీరోయిన్ గా అమరన్ ద సిటీ చాప్టర్ వన్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంటే దీనికి సీక్వెల్ కూడా ఉన్నట్టు హింట్ ఇచ్చినట్టే. అయితే తండ్రిగా సాయికుమార్ అండదండలు ఉన్నా సరే ఇన్ని సినిమాలు సాయికుమార్ ఇప్పించడం అనేది కష్టమనే చెప్పాలి.

Aadi Saikumar getting offers even after 12 flop movies

అయితే ఆది సాయి కుమార్ సిన్సియర్గా కష్టపడే తత్వం ఫలితం ఆశించకుండా పని చేసుకుని వెళ్లే స్వభావమే ఆయనకు ఇన్ని ఆఫర్స్ తెచ్చి పెట్టే పెడుతున్నాయని అంటున్నారు. గతంలో సాయి ధరమ్ తేజ్ కి కూడా ఇలాగే వరుస అపజయాలు ఎదురయ్యాయి. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆయన కధలు ఎంచుకునే విషయంలో కాస్త దృష్టి పెట్టడంతో మళ్లీ ట్రాక్ లో పడి ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఆది సాయి కుమార్ కూడా కాస్త కథల ఎంపికలో దృష్టి పెడితే మళ్లీ ఈయన కూడా హిట్ ట్రాక్ అందుకోవడం ఖాయం అనే అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X