గొడవ లొద్దనే...మహేష్ బాబు, శ్రీను వైట్ల డ్రాప్?
హైదరాబాద్: గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘ఆగడు' మూవీ ఫస్ట్ టీజర్.....హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో ఈ టీజర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ వివాదాస్పదం అయింది. ఆయన చెప్పిన డైలాగ్ ఇండస్ట్రీలోని ఇతర హీరోలను పరోక్షంగా కించపరిచినట్లు ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి.
‘ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకతో ఎదవ కంపేరిసన్స్...ఎలపరమోచ్చేస్తోది' అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగుపై ఇతర హీరోల అభిమానులు హర్ట్ అయ్యారు. మరో వైపు మహేష్ బాబు అభిమానులు మాత్రం పంచ్ అదిరింది అంటూ తెగ సంబరపడిపోయారు.

సినిమా విడుదలైన తర్వాత థియేటర్లకు వెళ్లిన మహేస్ బాబు అభిమానులు....ఆ డైలాగ్ ఎప్పుడొస్తుందా, విజిల్స్ ఎప్పుడేద్దామా? అంటూ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే సినిమా అయిపోయినా మహేష్ బాబు నుండి ఆ డైలాగ్ మాత్రం వినిపించలేదు. కట్ చేస్తే సినిమా నుండి ఆ డైలాగ్ తొలగించారని తేలింది.
ఆ డైలాగ్ వల్ల....అనవసర తలనొప్పులు, గొడవలు వస్తాయనే ముందు చూపుతో మహేష్ బాబు, శ్రీను వైట్ల ఓ నిర్ణయానికి వచ్చి ఆ డైలాగును డిలీట్ చేయించినట్లు తెలుస్తోంది. వివాద రహితుడిగా పేరున్న మహేష్ బాబు ఇలా చేయడం మంచిదే అని కొందరు సీనియర్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











