'ఆగడు' కు కొత్త తలనొప్పి: మహేష్ ఇన్వాల్ అవుతాడా?

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో హై ఎక్సపెక్టేషన్స్ తో రూపొందిన చిత్రం ఆగడు. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. అయితే విడుదలైన మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. దాంతో ఊహించని విధంగా రెండో రోజు నుంచి కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. ఈ నేపధ్యంలో బాగా నష్టపోతామనుకున్న ఈ చిత్రం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బుని వెనక్కి ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ పూర్తి స్ధాయిలో డ్రాప్ అవటం ఎవరూ ఊహించలేదు. ఈ భారీ చిత్రాన్ని భారీ మొత్తాలు ఇచ్చి సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ...14 రీల్స్ వారిని రికవరీ చేయమని అడుగుతున్నట్లు సమాచారం. గతంలో రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు చిత్రాలు కథానాయుకుడు, బాబా వంటివి ఫ్లాప్ అయినప్పుడు అక్కడ డిస్ట్ర్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇలాగే పట్టుబడితే.. రజనీ స్వయంగా కలగ చేసుకుని సెటిల్ చేసుకున్నట్లు చెప్పుకున్నారు.

Aagadu: Distributors demanding to return back the money

తమ పేరు చెప్పే బిజినెస్ జరుగుతున్నప్పుడు వారికి రికవరీ చెయ్యాల్సిన భాధ్యత కూడా హీరోలు తీసుకోవాలంటున్నారు. అయితే మహేష్ బాబు ఇందులో ఇన్వాల్స్ అవటానికి ఆసక్తి చూపటానికి ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఆయన త్వరలోనే వెకేషన్ కి వెళ్ళబోతున్నట్లు చెప్పుకున్నారు.

ఆగడు చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అవుతూండటంతో నిర్మాతలు..మహేష్ ని కలిసి...ప్రమేషన్ కు రమ్మని అడిగినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మహేష్ బాబు చాలా నిర్మహమాటంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్ని చోట్లా పూర్తి నెగిటివ్ టాక్ నడుస్తోందని, ఈ పరిస్ధితిల్లో తాను పూనుకుని ప్రమోట్ చేసినా ఫలితం ఉండదని ఆయన చెప్పినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతోంది.

అదే బ్యానర్ నుంచి వచ్చిన 1 నేనొక్కిడనే, ఆగడు రెండు కూడా ఊహించని విధంగా పరాజయం పొందటంతో మహేష్ బాబు చాలా నిరాసగా ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయన తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి వచ్చి తిరిగి తన పనుల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. తర్వాత ఆయన కొరటాల శివ తో చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ తో చేయబోయే చిత్రం పై బాగా ప్రెషర్ పడనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X