'ఆగడు': అనీల్ సుంకర అలా అనకుండా ఉండాల్సింది
హైదరాబాద్: ఓ సినిమా హిట్ అవ్వాలంటే ఫ్యాన్స్ చూస్తే సరిపోతుందా అనే సందేహం రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చూసేవారికి కలుగుతూంటుంది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాల్లో ఎక్కువ భాగం అభిమానులను ఆనందపరచటానికి ఉద్దేశించిన సీన్స్ చాలా ఉండటం గమనిస్తూంటాము. అయితే మహేష్ లాంటి హీరోలకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాక కుటుంబాలు కూడా వెళ్లి సినిమాలు చూస్తూండటం జరుగుతూంటుంది. అయితే నిర్మాతలు మాత్రం తాము ఫ్యాన్స్ ని సంతృప్తిపరచటానికే తీస్తున్నామని అంటున్నారు. తాజాగా ఆగడు గురించి నిర్మాత అనీల్ సుంకర అలాంటి స్టేట్ మెంటే ట్విట్టర్ ద్వారా ఒకటిచ్చారు.
తమ ఆగడు చిత్రం సూపర్ స్టార్ అభిమానులను తప్పక సంతృప్తి పరుస్తుందని అన్నారు అనీల్ సుంకర. మహేష్ తో చేసిన భారీ చిత్రం 1, నేనొక్కిడినే వంద రోజులు పూర్తైన సందర్బంగా ఆయన ట్వీట్ చేస్తూ ఈ మాట అన్నారు. అయితే అదే బ్యానర్ లో అదే కాంబినేషన్ లో వచ్చిన దూకుడు...కుటుంబ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుని పెద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం అభిమానులు మాత్రమే ఆ సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అనీల్ సుంకర అలాంటి మాట అనకుండా ఉండాల్సింది అంటున్నారు.

ఆగడు విషయానికి వస్తే... ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











