'ఆగడు' టీజర్ టాక్: 'గబ్బర్ సింగ్'‍లా ఉందంటున్నారు!

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లు ఈ రోజు కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇవి చూసిన చాలా మంది 'గబ్బర్ సింగ్' మాదిరిగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు స్టైల్, ట్రైలర్లోని కొన్ని సీన్లు అచ్చు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను చూసిన అనుభూతిని కలిగిస్తోందని అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందని, ముఖ్యంగా మహేష్ బాబు చురుకుగా, స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అతని పాత్ర పేరు ఎన్‌కౌంటర్ అని తెలుస్తోంది. గతంలో మహేష్ బాబుతో 'దూకుడు' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Aagadu

పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు....
మహేష్ బాబు చెప్పిన కొన్ని డైలాగ్స్ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ 'నేను సింహం లాంటోడిని...అది గడ్డం గీసుకోదు...నేను గడ్డం గీసుకుంటాను...మిగతాదంతా సేమ్ టు సేమ్' అనే డైలాగ్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా 'ఆగడు' చిత్రంలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ 'ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్.....' అంటూ ఉంది. సో ఇది కావాలని పవన్ కళ్యాణ్‌పై సెటైరిక్‌గా ప్లాన్ చేసారని, ట్రైలర్ రిలీజ్ హాట్ టాపిక్ కావాలని, ఈ విషయం మీడియాలో చర్చీనీయాంశం కావాలనే ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X