‘ఆగడు’లో సీన్స్ ఆ హిందీ చిత్రం నుంచి... ?

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు తాజాగా 'ఆగడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బాలీవుడ్ సూపర్ హిట్ 'స్పెషల్ చభ్బీస్ 'చిత్రం నుంచి లిఫ్ట్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ చిత్రంలో హైలెట్ గా నిలిచిన రెండు ఎపిసోడ్స్ కొద్దిపాటి మార్పులతో ఈ చిత్రంలో ఉంటాయని చెప్పుకుంటున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన దూకుడు చిత్రం...జర్మనీ చిత్రం గుడ్ బై లెనిన్ నుంచి ప్రేరణ పొందినదనే విషయం తెలిసిందే.

స్పెషల్ చబ్బీస్ యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే 'ఆగడు'లో మహేష్ పాత్ర నానా పటేకర్...అబ్ తక్ చప్పన్ చిత్రంలో చేసిన ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ప్రేరణతో ఉంటుందని సమాచారం. అలాగే ఈ పాత్ర పేరు...ఎనకౌంటర్ శంకర్ అని, అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, చాలా పరవ్ ఫుల్ గా ఈ పాత్రను డిజైన్ చేసారని, అయితే ఆ కథ సీరియస్ గా జరిగితే ఈ సారి..ఫన్ తో నడుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లోచెప్పుకుంటున్నారు.

ఇక మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్‌ని తీసుకొచ్చిన చిత్రం దూకుడు. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కలయికలో సినిమా అనగానే... 'ఆగడు'పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. 'దూకుడు'లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. 'ఆగడు'లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X