ఐటీ అధికారుల కాల్: ఆగడు నిర్మాతలకు చెమటలు, కూల్...
హైదరాబాద్: ఓ వైపు మహేష్ బాబు నటించిన ‘ఆగడు' సినిమా విడుదల సందడి మొదలైంది. కలెక్షన్లు ఎంత వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి అనే లెక్కల్లో మునిగిపోయారు నిర్మాతలు. అయితే ఉన్నట్టుండి వచ్చిన ఓ కాల్ ‘ఆగడు' నిర్మాతలకు చెమటలు పట్టించింది. ఆ కాల్ వచ్చింది మరెక్కడి నుండో కాదు....ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటుకు సంబంధించిన అధికారుల నుండి.
అయితే కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత నిర్మాతలు కూల్ అయ్యారట. ఇంతకీ ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటుకు చెందిన వారు నిర్మాతలకు ఫోన్ చేసింది ఎందుకు అంటే? ‘ఆగడు' సినిమా టిక్కెట్ల గురించేనని అంటున్నారు. ఈ విషయం ఇపుడు ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల విడుదల ముందు ఐటీ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆగడు సినిమా విషయానికొస్తే...
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లి ఈ సినిమా నిరభ్యరంతంగా చూడొచ్చని అర్థం. ‘ఆగుడు' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసారు. మరో వారంలో ‘ఆగడు' విడుదల కానుండటంతో అన్ని థియేటర్లలో...కొత్త థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శిస్తున్నారు.
‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ దాదాపు 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే సినిమా విడుదల ముందే భారీగా బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఇప్పటికే రూ. 75 కోట్ల వరకు నిర్మాతలకు ముట్టాయని అంటున్నారు.
ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.


Click it and Unblock the Notifications











