లిప్‌లాక్ ముద్దు సీన్‌తో రికార్డు సృష్టించబోతున్న అమీర్-అనుష్క!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
అమీర్ ఖాన్, అనుష్క వర్మ కలిసి 'పికే'(Peekay) అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్ ఇదే అని అంటున్నారు.
ఇప్పటి వరకు అమీర్ ఖాన్ దాదాపుగా తనతో నటించిన అందరు హీరోయిన్లతో లిప్ లాక్ సీన్లలో పాల్గొన్నాడు. కరిష్మా కపూర్, జుహి చావ్లా, కరీనా కపూర్, సోనాలి బింద్రే ఇలా చాలా మందిని ముద్దు పెట్టుకుని అలాంటి సీన్లు చేయడంలో ఆరితేరిపోయారు.
అనుష్క వర్మకు కూడా ముద్దు సీన్లు చేయడంలో మంచి అనుభవమే ఉంది. బ్యాండ్ బాజా భారత్, లేడీస్ వర్సెసస్ రికీ బాల్ చిత్రాల్లో రన్వీర్ సింగ్‌తో, మాతృ కి బిజ్లీ కా మండోలా చిత్రంలో ఇమ్రాన్ ఖాన్‌తో ముద్దు సీన్లు చేసింది. ఇపుడు అమీర్ ఖాన్ తో లాంగెస్ట్ ముద్దు సీన్ చేసి రికార్డులకెక్కబోతోంది.
'పీకే' సినిమా విషయానికొస్త.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు. 2014లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications












