For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR31: మరో సెన్సేషనల్ కాంబో.. ఎన్టీఆర్‌తో ఇండియన్ సూపర్ స్టార్.. బాలీవుడ్‌నే షేక్ చేస్తోన్న న్యూస్

  |

  నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభం నుంచీ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా దీనిపై ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూడండి!

  హిట్లు మీద హిట్లు కొడుతూ

  హిట్లు మీద హిట్లు కొడుతూ

  ఆ మధ్య హిట్లు లేక ఇబ్బంది పడిన జూనియర్ ఎన్టీఆర్.. 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. అప్పటి నుంచి తారక్ ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు.

  యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!

  నేషనల్ రేంజ్‌లో ఎన్టీఆర్

  నేషనల్ రేంజ్‌లో ఎన్టీఆర్

  ఫుల్ సక్సెస్ ట్రాకులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది.

  కొరటాలతో వచ్చే ఏడాదే

  కొరటాలతో వచ్చే ఏడాదే

  RRR పట్టాలపై ఉన్నప్పుడే తారక్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి అయింది. ఈ చిత్రాన్ని వచ్చే జనవరి నుంచి మొదలు పెట్టబోతున్నారు.

  గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

  ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టు

  ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టు


  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని టాక్.

  తెరపై ఇద్దరు స్టార్ల పేర్లు

  తెరపై ఇద్దరు స్టార్ల పేర్లు


  ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభానికి చాలా సమయమే ఉన్నా.. దీని గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇందులో కమల్ హాసన్ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అది మరువక ముందే ఇటీవలే ఇందులో మోహన్‌లాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే మరొకొందరు స్టార్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

  Bigg Boss 7: బిగ్ బాస్‌కు బాలయ్య షాకింగ్ కండీషన్స్.. నాగార్జునకు మరో దెబ్బ.. ఇండస్ట్రీలో కలకలం

  ఎన్టీఆర్‌తో సూపర్ స్టార్

  ఎన్టీఆర్‌తో సూపర్ స్టార్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన కాస్టింగ్‌పై ప్రశాంత్ నీల్ ఫోకస్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో తారక్‌తో పాటు ఇండియన్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటింపజేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయనతో నిర్మాతలు సంప్రదింపులు కూడా జరిపాయరని తెలిసింది.

  ఓకే అన్న వెంటనే రెడీ

  ఓకే అన్న వెంటనే రెడీ


  వాస్తవానికి 'లాల్ సింగ్ చడ్డా' మూవీ తర్వాత అమీర్ ఖాన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ నిర్మాతల ద్వారా ఆయనతో చర్చలు జరిపారని తెలిసింది. ఒకవేళ ఇందులో నటించేందుకు అమీర్ సుముఖత చూపితే.. ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చి స్టోరీ వినిపించేందుకు రెడీగా ఉన్నాడట. ఇదే జరిగితే ఫ్యాన్స్‌కు పండగే అనొచ్చు.

  English summary
  Tollywood Star Hero Jr NTR will do a film Under Prashanth Neel Direction. Aamir Khan Green Signal for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X