మహేశ్ - రాజమౌళి మూవీలో మరో సూపర్ స్టార్: ఒకే సినిమాలో ఇంత మంది హీరోలా!

కొంత మంది తెలుగు స్టార్ల కాంబినేషన్‌లలో వచ్చే ప్రాజెక్టులపై టాలీవుడ్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అవుతోంది. మరికొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రాబోతున్న సినిమా. క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వీటిని మరింతగా పెంచేలా ఇందులో మరో సూపర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది. ఇంతకీ ఆ హీరో ఎవరో మీరే చూడండి!

సూపర్ స్టార్లతో రాజమౌళి:తెలుగు సినిమా స్థాయికి ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడే రాజమౌళి. RRRతో సెన్సేషనల్ హిట్ కొట్టిన ఆయన తన తదుపరి ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్నారు. ఇప్పటికే దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. దీనికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది స్టార్లు భాగం కాబోతున్నారు.

Aamir Khan Key Role in SS Rajamouli and Mahesh Babu Movie

ఆ పనులు పూర్తి చేశారు:అదిరిపోయే కాంబినేషన్ కావడంతో రాజమౌళి - మహేశ్ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై వర్క్ చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే దాన్ని పూర్తి చేసుకున్నారు.

అడ్వెంచర్ స్టోరీ మూవీ:పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇందులో మహేశ్ బాబు లుక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా ఉండబోతున్నాయట.

Aamir Khan Key Role in SS Rajamouli and Mahesh Babu Movie

ఇప్పుడు ఆ వర్క్‌పైనే:మహేశ్ బాబు హీరోగా రాజమౌళి రూపొందించబోతున్న ఈ సినిమా 2022 ద్వితీయార్థంలోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఈ మూవీ ప్రీ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్ రైటింగ్ జరుగుతోంది. ఇది పూర్తైన వెంటనే సినిమాను ప్రారంభిస్తారని సమాచారం.

సినిమాలో సూపర్ స్టార్:ఇండియాలోనే నెవ్వర్ బిఫోర్ ప్రాజెక్టుగా రాబోతున్న మహేశ్ బాబుతో పాటు చాలా మంది స్టార్ హీరోలు కూడా నటించబోతున్నట్లు ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే నాగార్జున ఇందులో కీలక పాత్ర చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో ఇండియన్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

Aamir Khan Key Role in SS Rajamouli and Mahesh Babu Movie

అలాంటి పాత్రలోనే:దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నాడని తెలిసింది. అంతేకాదు, మహేశ్ బాబుతో సమానమైన రన్ టైం కూడా ఉండబోతుందని అంటున్నారు. తద్వారా ఈ చిత్రం బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందనుందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X