ఇదేం రచ్చ: పీకే పై కాపీ కామెంట్స్

By Srikanya

ముంబై : ఆడియన్స్ మారిపోయారు. గతంలోలోగా కాకుండా వెంటనే ఎలా ఉందో రిజల్ట్ చెప్పటమే కాకుండా... అది ఎక్కడ నుంచి గత రెండు రోజులుగా... పీకే ఫస్ట్ లుక్ పోస్టర్ పై కాపీ కామెంట్స్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. 1973 లో వచ్చిన పోర్చుగీసు చిత్రం Quim Barreiros పోస్టర్ ని పోలి ఉంది. ఈ రెండు పోస్టర్స్ ని ప్రక్క ప్రక్కనే పెట్టి షేర్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అమీర్‌ ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపిస్తున్నట్టు ముందే తెలిసినా, ఇప్పుడు పోస్టర్‌ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేశాడు అమీర్‌. ఇంతకీ ఎలా ఉన్నాడు? ఒంటిపై దుస్తులు లేకుండా రైలు పట్టాలపై అడ్డంగా నుంచుని తీక్షణంగా చూస్తున్నాడు. చేతిలో ఓ టూ ఇన్‌ వన్‌ను అడ్డం పెట్టుకున్నాడు కూడా. తన మూడు దశాబ్దాల సినీ జీవితంలో అమీర్‌ ఇలాంటి అవతారంలో కనిపించడం ఇదే తొలిసారి. ఆన్‌లైన్లో ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.

మరో ప్రక్క ''నేనెలా ఉన్నానో తొందరగా చెప్పండి. తెగ కంగారుగా ఉంది'' అంటున్నాడు అమీర్‌ఖాన్‌. 'పీకే'లో తన కొత్త గెటప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి అభిమానుల అభిప్రాయాలను కోరుతున్నాడు.

Aamir Khan's 'PK' poster copied?

కరణ్‌ జోహార్‌ స్పందిస్తూ ''అద్భుతంగా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది'' అని ట్వీట్‌ చేశాడు. ''పిచ్చెక్కిపోతోంది. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం'' అంటూ విశాల్‌ దద్లానీ వ్యాఖ్యానించాడు. ఈ స్పందనలను చూశాక అమీర్‌ మళ్లీ ట్వీట్‌ చేస్తూ, ''గ్రహాంతర వాసా? ఆది మానవుడా? తాగుబోతా? అబ్బో... ఇలా చాలా రకాలుగా ఊహిస్తున్నారు. హ..హ్హ...హా... చాలా ఆనందంగా ఉంది'' అని రాశాడు.

ఇంతకీ ఈ పాత్ర ఏమిటనే విషయాన్ని త్వరలోనే బయటపెడతారట. ఈ ఏడాది డిసెంబర్‌19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వం వహిస్తున్నారు.

'పీకే' సినిమా విషయానికొస్తే.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు.

అలాగే అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్‌ ఇదే అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X