జక్కన్న భారతంలో కృష్ణుడిగా అమీర్.. కర్ణుడిగా షారుఖ్!
బాహుబలి2 తర్వాత మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
బాహుబలి2 తర్వాత మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సన్నాహాలు మొదలుపెట్టినట్టు ఫిలింనగర్ లో ఓ వార్త షికారు చేస్తున్నది.

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ కృష్ణుడిగా, షారుక్ ఖాన్ కర్ణుడిగా నటించే అవకాశమున్నట్టు సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏంటనే విషయంపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
ఇదిలా ఉండగా బాహుబలి2 తర్వాత 1000 కోట్ల బడ్జెట్ తో గరుడ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు గతంలో జక్కన తెలిపారు. ఈ నేపథ్యంలో గరుడు ఉంటుందా లేక మహాభారతాన్ని తెరకెక్కిస్తారా అనే విషయంపై స్పష్టత రావాలంటే రాజమౌళి పెదవి విప్పాల్సిందే.


Click it and Unblock the Notifications











