'రాజేంద్రప్రసాద్' ను నిద్రలేపిన 'అమీర్'
తెల్లవారుజామున 1:15 గంటలకు 'నట కిరీటి' రాజేంద్రప్రసాద్ కు ఫోన్ వచ్చింది. అటుగా మాట్లాడుతున్నది 'క్విక్ గన్ మురుగన్' చిత్ర దర్శకుడు శశాంక్ ఘోష్. అమీర్ ఖాన్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఈ సమయంలో మాట్లాడటం మీకు ఇబ్బంది కాకపోతే...ఇదీ ఆయన చెప్పిన సమాచారం. అంత గొప్పనటుడు మాట్లాడాలనుకుంటే కాదంటారా, సరేనన్నారు.
'నట కిరీటి' తో మాట్లాడిన అమీర్, 'క్విక్ గన్ మురుగన్' చిత్రంలో ఆయన నటన గురించి పొగడ్తలతో ముంచెత్తారట. చిత్రం చాలా బాగుందని, ఇందులో మీ నటన అధ్బతంగా వుందని అభినందించారట. అంతే కాదు ఈ చిత్రం గురించి అమీర్ తన బ్లాగ్ లో కూడా రాసారట. 'క్విక్ గన్ మురుగన్' సినిమా చూసానని చాలా బాగుందని రాసారట.
రాజేంద్రప్రసాద్ కౌబాయ్ గా నటించగా, ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమా ఆంగ్లం, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 28న విడుదల కాబోతోంది. తెలుగులో సెప్టెంబరు 24న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











