మాజీ ప్రియుడుతో మళ్లీ ఆర్తి

By Staff

Aarthi Agarwal
తరుణ్, ఆర్తి అగర్వాల్ ప్రేమాయణం అందరికీ తెలిసిందే. అయితే వివాహనంతరం దానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ తాజాగా ఆమె సిటీలో కి మళ్ళీ దిగింది. అక్కడితో ఆగక తన మాజీ లవర్‌ తరుణ్‌ ప్రారంభించిన పబ్‌ ఆన్ కి వెళ్ళిందట. అయితే ఈ వార్త తెలిసిన కొందరు ఆర్తి అగర్వాల్‌ వెళ్ళింది పబ్‌ కా లేక తన మాజీ లవర్‌ ని కలవటానికి అని ఫిలింనగర్‌ లో గుసగుసలాడుకుంటున్నారు‌. ఇక పెళ్ళయి ఏడాది అయిందో లేదో అప్పుడే భర్త వదిలేసిందనే వార్తలు ఆర్తి అగర్వాల్ గురించి వినపడుతున్నాయి. ఆమె భర్తతో ఆమెకు సరిపడటం లేదని, అయినా ఇక్కడ తళుకు బెళుకల జీవితం చూసిన ఆమె అక్కడ ఇమడలేకపోయిందని సమాచారం.

అలాగే సెలబ్రేటీగా ఇక్కడ ఎక్కడకెళ్ళినా అంతా చుట్టముడతారని అదే తాను కాపురం పెట్టిన అమెరికాలో పేరు చెప్పినా పట్టించుకునే వారు లేరని ఆమె బాద పడేదని అదే మళ్ళీ ఇండియాకు లాక్కు వచ్చిందంటున్నారు. అప్పట్లో ఆమె ఆత్మ హత్య ప్రయత్నం, పెళ్ళి వరసగా జరిగాయి. ఆ తర్వాత ఆమె వార్తలు వినపడలేదు. కానీ హఠాత్తుగా ఆమె ప్రత్యక్ష్యమై నేను లావు తగ్గాను స్లిమ్ గా ఉన్నాను అంటూ ప్రెస్ మీట్ పెట్టి అవకాశాల కోసం రిక్వెస్ట్ చేయటం జరిగింది.

ఆమె తోటి వారందరూ బాలీవుడ్ కి వెళ్ళి గెలుపు జెండా ఎగరేస్తూంటే ఆమె ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాలనే ప్రయత్నంలో పరిచయమున్న దర్శకులను పర్శనల్ గా కలుస్తున్నట్లు సమాచారం. అయితే ఆమెను పరిచయం చేసిన విజయ్ భాస్కర్ ఖాళీగా ఉంటే, ఎంకరేజ్ చేసిన బి.గోపాల్ ఏం చేయాలి అంటూ మస్కా అనంతరం ఆలోచనలో పడ్డారు. ఇక హీరోలయితే ఎప్పుడో మర్చిపోయి ఉన్నారు. ఈ మద్య కాలంలో రాశి తర్వాత ఇలా కెరిర్ ని మలుచుకోలేక మిగిలిపోయిన తార ఆర్తి అగర్వాల్ మాత్రమే. అలాగే ఆమె రూటులోనే భర్తను వదిలేసి వేషాలంటూ మళ్ళీ వెతుకులాట ప్రారంభించింది.ఇక తరుణ్ ఏమన్నా తరుణోపాయం చెపుతాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X