విలన్ తో డేటింగ్ చేస్తున్న ఆర్తి అగర్వాల్
మొదట్లో తరుణ్ తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి, అనంతరం వివాహం చేసుకున్న ఆర్తి అగర్వాల్ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్న సంగితి తెలిసిందే. తన భర్త మంచివాడేనని, అయినా తనకు అతనికీ సరిపడటం లేదని అందుకే విడిపోయి ఉంటున్నామని ఆమె చెప్తోంది. ఇక తాజాగా ఆమె విలన్ వేషాలు వేసుకునే ముకుల్ ఆనంద్ తో డేటింగ్ చే్స్తోందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా వినపడుతోంది. ముకుల్ ఆనంద్, ఆర్తి అగర్వాల్ కలిసి రోజూ రాత్రి పార్టీలకు అటెండవుతున్నారని, అతనికోసం ఆమె ముంబియ కి కూడా మకాం మార్చే ఆలోచన చేస్తోందని చెప్తున్నారు. వీరిద్దరి పరిచయం భరత్ డైరక్షన్ లో రూపొందుతోన్న నీలవేణి చిత్రం సమయంలో జరిగిందని, లిప్ టు లిప్ కిస్ ని షూటింగ్ లో భాగంగా పెట్టుకున్న తర్వాత వీరి బంధం బలపడిందని చెప్తున్నారు. అయితే ఇది ఆర్తి అగర్వాల్ తండ్రికి ఇష్టం లేదని అందుకే అతను ముకుల్ ఆనంద్ తో గొడవ పడ్డారని చెప్తున్నారు. అందుకే నీలవేణి ప్రాజెక్టు ముందుకు సాగటం లేదని చెప్తున్నారు. ఇక ఆర్తి అగర్వాల్ రీ ఎంట్రీ ఇస్తూ పోసాని సరసన చేసిన జెంటిల్ మెన్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











