ఆర్తి రోజు రేటు ఎంతంటే...
ఆర్తి అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లో సినిమాకి ఇంత అని ప్యాకేజి రేటు కాకుండా ఏ రోజు కా రోజు పేమెంట్ తీసుకుంటోందని సమాచారం. మినిమం రోజుకు లక్ష రూపాయలు ఇస్తానంటేనే ఎగ్రిమెంట్ పై సంతకం పెడుతోందని చెప్తున్నారు. అలాగే ఏ రోజు కా రోజు సాయింత్రమే ఆ రేటు ఆమెకు పే చేయాలని కండిషన్ కూడా పెడుతున్నట్లు చెపుతున్నారు. అంతేగాక ఆమె తనని ఉదయం ఏడు గంటలకు పికప్ చేసుకుని సాయింత్రం ఐదుకల్లా విడిచిపెట్టే షరతు పైనే చేస్తానని క్లియర్ గా చెప్తోందిట. దాంతో ఆ విధంగా ఈ కండిషన్స్ కి ఒప్పుకున్న వారే ఆమెను బుక్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇలా మూడు సినిమాలు చేస్తోంది. నటన, పేరు కన్నా ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో పూర్తిగా డబ్బు పైనే దృష్టి కేటాయించిందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. అదీ సంగతి.
aarthi agarwal re entry three films posani krishna murali demand one lack ఆర్తి అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ రోజుకు లక్ష ఎగ్రిమెంట్


Click it and Unblock the Notifications