పెళ్ళయినా తరుణ్ తో కంటెన్యూ
తరుణ్, ఆర్తి అగర్వాల్ ప్రేమాయణం మళ్ళీ మొదలైందని అంతటా వినిపిస్తోంది. పెళ్ళికి ముందు ఈ ప్రేమ చాలా దూరం వరకూ వెళ్ళి ఆగిందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె వివాహనంతరం అమెరికాకి వెళ్ళటంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ తాజాగా ఆమె సిటీలో కి మళ్ళీ దిగింది. అక్కడితో ఆగక తన మాజీ లవర్ తరుణ్ ప్రారంభించిన పబ్ ఆన్ కి రోజూ వెళ్తోందని చెప్తున్నారు. అయితే ఈ వార్త తెలిసిన కొందరు ఆర్తి అగర్వాల్ వెళ్ళింది పబ్ కా లేక తన మాజీ లవర్ ని కలవటానికి అని అంటున్నారు. మరో ప్రక్క పెళ్ళయి ఏడాది అయిందో లేదో అప్పుడే భర్త వదిలేసిందనే వార్తలు ఆర్తి అగర్వాల్ గురించి వినపడుతున్నాయి. ఆమె భర్తతో ఆమెకు సరిపడటం లేదని, ఐడెండిటి క్రైసెస్ తో అక్కడ ఇమడలేకపోయిందని సమాచారం.
అప్పట్లో ఆమె ఆత్మ హత్య ప్రయత్నం, పెళ్ళి వరసగా జరిగాయి. ఆ తర్వాత ఆమె వార్తలు వినపడలేదు. కానీ హఠాత్తుగా ఆమె ప్రత్యక్ష్యమై నేను లావు తగ్గాను స్లిమ్ గా ఉన్నాను అంటూ ప్రెస్ మీట్ పెట్టి అవకాశాల కోసం రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఈ క్రమంలో ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాలనే ప్రయత్నంలో పరిచయమున్న దర్శకులను పర్శనల్ గా కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమెను పరిచయం చేసిన విజయ్ భాస్కర్ ఖాళీగా ఉంటే, ఎంకరేజ్ చేసిన బి.గోపాల్ ఏం చేయాలి అంటూ మస్కా అనంతరం బాలకృష్ణ సైతం సినిమా ఇవ్వలేదు. ఇక హీరోల్లో అందాలరాముడు చేసిన సునీల్ సైతం తన ప్రక్కన ఎంకరేజ్ చేసేటట్లు కనపడటం లేదు. పూర్వ వైభవం ఎలా ఉన్నా పూర్వపు అలవాట్లు మానుకోలేకే తరుణ్ చుట్టూ తిరుగుతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











