జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్ళు అంటున్న ఆర్తి!
'నువ్వు నాకు నచ్చావ్' తో తొలిసారి తెలుగు తెరపై తళుక్కుమని మెరిసిన ఆర్తి అగర్వాల్ అప్పట్లో కుర్రకారు ఫ్యాన్ గా ఓ తారలా మెరిసింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్రహీరోలతో పాటు తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి కుర్రహీరోలతోనూ నటించింది. ప్రాణాంతకమైన యాక్సిడెంట్ నుంచి బయటపడి తిరిగి నటనను కొనసాగిస్తూ ఆదరాబాదరగా ఆర్య సమాజ్ లో పెళ్లాడిన నటి ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయి, గోడకు కొట్టిన బంతిలా వెను వెంటనే తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఆర్తి తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్ లో టాప్ హీరోలందరితోనూ నటించిన ఆర్తి ఇప్పుడు బి,సి గ్రేడ్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం ఆమె అభిమానులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ప్రస్తుతం పోసాని కృష్ణమురళి సరసన, భరత్ పారేపల్లి సినిమాలో నటిస్తూ తన రేంజ్ ని పాతాళానికి పడేసుకున్న ఆర్తి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో భర్త నుండి విడిపోయిన సంగతి తెలియజేసింది. సరిగా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నానని, అయితే తామిద్దరి అభిప్రాయాలు కలవవని తెలుసుకున్నానని, పరస్పర అంగీకారంతో విడిపోయామని ఆర్తి తెలియజేసింది. తన జాతకంలోనే రెండు పెళ్లిళ్లు రాసి వున్నాయని, ఈ సారి మాత్రం ఆలోచించి గానీ నిర్ణయం తీసుకోనని ఆమె పేర్కొంది. ఆర్తి ప్రస్తుతం పోసాని కృష్ణమురళితో 'జెంటిల్ మన్', లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'నీలవేణి'లోనూ నటిస్తోంది. ధర్మవరపు సుబ్రమణ్యం హీరోగా పనిచేస్తున్న సినిమాలోనూ ఆర్తి పేరు అప్పట్లో అనౌన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











