'జగదేక వీరుడు అతిలోక సుందరి' నే కొద్దిగా మార్చి...
చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టయిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ని మర్చిపోని తెలుగువాడుండదు. ఇప్పుడు ఆ సినిమానే కాస్త అటూ ఇటూ మార్చి 'వనకన్య వండర్ వీరుడు' సినిమాని రూపొందించారని విశ్వసనీయ సమాచారం. అంతేగాక ఈ చిత్రం లో హీరో గా చేసిన కుర్రాడు పేరు కూడా 'మెగా సుప్రీం' అని పెట్టారు. ఆ కుర్రాడు ఎవరో కాదు...ఈ చిత్రం దర్శకుడు శివనాగు కుమారుడు.ఇక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరూ అంటే ఫేడవుట్ అయిపోయిన ఆర్తి అగర్వాల్ కావటం విశేషం. ఇక ఇందులో వనకన్యగా ఆర్తీ అగర్వాల్, వండర్ వీరునిగా మెగా సుప్రీమ్ నటిస్తున్నారు. వనకన్య వనలోకం నుంచి భూలోకానికి వచ్చే సన్నివేశాలుతో సినిమా నడుస్తుంది. శ్రీరాఘవేంద్ర ఫిలింస్ పతాకంపై జాలాది శివశంకర్‌చౌదరి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇంతకీ ఈ లేటెస్ట్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' హిట్టవుతుందా లేదా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











