»   » ముద్దు సన్నివేశాల్లో లీనమై జీవిస్తున్న ఆర్తి అగర్వాల్!

ముద్దు సన్నివేశాల్లో లీనమై జీవిస్తున్న ఆర్తి అగర్వాల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్తి అగర్వాల్ లో ఏదో ఆకర్షణ వుంది. అందుకే 'నువ్వునాకు నచ్చావ్"లో వెంకటేష్ సరసన నటించి ఆ సినిమా హిట్ అవడంతో వరసగా చిత్రాలు వచ్చి బిజీ అయింది. అందరి హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. ఓ సినిమాలో 'సిలెండర్ లా వుంటుంది". అన్న అక్కినేని నాగార్జున డైలాగ్ ని నిజం చేయకపోతే ఎలా అనుకుందేమో? పిజ్జాలు, ఐస్ క్రీమ్ లు, మెక్సికన్ వంటకాలు బాగా ఇష్టపడి ఆర్తిగా తినేసే ఆర్తి అగర్వాల్ మరి సిలెండర్ లానే తయారైయింది.

'గోరింటాకు" చిత్రంలో అలానే కనిపించింది కూడా నాజూకుతనం కోల్పోయింది. సునీల్ తో అందాల రాముడు పై ఎన్నో ఆశలు పెట్టుకుని పోసాని నటించిన 'జెంటిమేన్" కూడా ఆమె కెరీర్ రీ ఎంట్రీకి దోహదం కాలేదు. ఇప్పుడు 'నీలవేణి" చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తూ ఆ చిత్రం మీద చాలా ఆశలు పెంటుకొన్నది. నీలవేణిలో తన పాత్రకు మంచి గుర్తింపు టాలీవుడ్ లో వస్తుందని భావించి, ఆ గుర్తింపు కోసం, ఇమేజ్ పెంచుకోవడం కోసం 'నో" అని చెప్పకుండా ఎలా అంటే అలా ఎక్స్ పోజింగ్ చేసేసిందట. అంతే కాదు ముద్దు సన్నివేశాల్లో కూడా లీనమై జీవించిందంటున్నారు. మరీ బొద్దుగా తయారై రెచ్చిపోయిన ఆర్తికి 'నీలవేణి" ఎలాంటి ఇమేజ్ తెస్తుందో వేచి చూడాల్సిందే.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu