»   » ఆర్తి అగర్వాల్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ?

ఆర్తి అగర్వాల్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aarti Agarwal
అవును...ఒకప్పుడు 'నువ్వు నాకు నచ్చావు' టైమ్ లో ఒక వెలుగు వెలిగిన ఆర్తి ఇప్పుడేం చేస్తోంది. చేతిలో సినిమాలు కూడా లేవాయే. ఎవరన్నా ధైర్యం చేసి అవకాశం ఇద్దామనుకున్నా ఆమె 'నేనున్నాను' సినిమాలో నాగార్జున పిలిచినట్లు గ్యాస్ సిలిండర్ లా మారిందే.అయినా పెళ్ళింయింది కదా ..ఆ భాధ్యతలు అవీ చూసుకుంటుంది అంటే 'గోరింటాకు' సినిమా ఎందుకు చేసినట్లు అని డౌటు వస్తుంది.సరే తిరిగే కాలు మొరిగే నోరు ఆగవు అలాగే ఒక్క సారి ఫేస్ పై మేకప్ పడ్డాక అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.

అందుకే చాలా మంది ముందు సినీ జీవితం నుండి రిటైర్ అయినా తిరిగి కొంత కాలానికి మేకప్ కి ఎగపడతారు.అసలు ఈ సబ్జెక్టు మీద హాలీవుడ్ అప్పుడెప్పుడో 'సన్ సెట్ బొవాల్డ్' అనే సినిమా కూడా తీసారనుకోండి.ఇక మన ఆర్తి దగ్గరకి వస్తే ఆమె తన చెల్లెలు అదితి అగర్వాల్(గంగోత్రి హీరోయిన్) కలసి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్టబోతోందని తెలుస్తోంది.ఎక్కడా అంటే అట్లాంటాలోనట.ఇప్పటికే ఓ బిజెనెస్ మేనేజ్ మెంట్ కంపెనీ వారు ఎస్టిమోషన్ వేసి కొటేషన్ అప్లయి చేయించారుట.అన్నీ అనుకూలిస్తే ఆమె నవంబర్ లో ఆ బిజినెస్ లోకి దిగే అవకాశం ఉందిట.కాబట్టి ఆర్తి అక్కడ వారికి క్యాష్ కౌంటర్స్ లో కనపడొచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X