జూ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ ఎంట్రీ... త్రివిక్రమ్ భలే ప్లాన్ వేశాడే!
ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ ఆయన 28వ సినిమా ద్వారా ఫిల్మ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.
జూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ అతిథిగా ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఫిబ్రవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
Recommended Video

ఎస్ రాధాకృష్ణ(చిన్న బాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ నటించబోతున్నాడట.

అభయ్ రామ్ ఎంట్రీ నిజమేనా?
ఇటీవల ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తన తండ్రితో పాటు వచ్చిన అభయ్ రామ్.... సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఉన్నట్టుండి ఇపుడు అభయ్ రామ్ పేరు తెరపైకి రావడం, సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. అభయ్ రామ్ ఉంటే సినిమాకు మరింత ఆకర్షణ వస్తుందనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు
అయితే అభయ్ రామ్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పటి వరకు అయితే అఫీషియల్ ప్రకటన రాలేదు. మరి ఇందులో నిజం ఎంతో స్వయంగా ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తే బావుంటుందని అభిమానుల అభిప్రాయం.

సునీల్ విషయంలో కూడా
ఈ చిత్రానికి సంబంధించి హీరో సునీల్ పేరు కూడా వినిపిస్తోంది. ఒక ముఖ్యమైన పాత్రకి గాను నారా రోహిత్ ను అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆ పాత్రను సునీల్ కి ఇచ్చినట్టుగా టాక్. ఈ విషయంలో ఎన్టీఆర్ ను కూడా త్రివిక్రమ్ ఒప్పించాడని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

ఎన్టీఆర్ 28
ఎన్టీఆర్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ(చిన బాబు) నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి మూవీ. అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ వరుస సక్సెస్‌లతో మంచి జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

బరువు తగ్గనున్న ఎన్టీఆర్
సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గడంతో పాటు ఫిజిక్ పరంగా పలు మార్పులు చేయబోతున్నాడని సమాచారం. అలాగే మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకోబోతున్నాడట. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











