For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్, అల్లు అర్జున్ కుమారుల టాలీవుడ్ ఎంట్రీ: పాన్ ఇండియా మూవీ కోసం డైరెక్టర్ మాస్టర్ ప్లాన్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో చాలా మంది తమలోని అద్భుతమైన టాలెంట్లతో సత్తా చాటుతున్నారు. దీంతో మరింత మంది సినీ రంగ ప్రవేశం చేయడానికి ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అనకూల ఫలితాలు వస్తుండడంతో చిన్న వయసు నుంచే తమ పిల్లలను పరిచయం చేసేందుకు హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్, అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌ టాలీవుడ్‌లోకి ఎంటర్ అవబోతున్నారట. అసలేం జరుగుతోంది? ఆ వివరాలు మీకోసం!

  SSMB 28 : అక్కినేని హీరో వైపు చూస్తున్న Trivikram, నో చెప్పే ఛాన్సే లేదు || Filmibeat Telugu
  గుణశేఖర్ పాన్ ఇండియా ప్రాజెక్టుతో

  గుణశేఖర్ పాన్ ఇండియా ప్రాజెక్టుతో

  భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన గుణశేఖర్ ప్రస్తుతం ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నారు. ఇందులో సమంత అక్కినేని టైటిల్ రోల్‌ను చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

   సమంతకు జోడీగా మలయాళ హీరో

  సమంతకు జోడీగా మలయాళ హీరో

  ‘శాకుంతలం' మూవీ లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ కథ మొత్తం సమంత పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇక, ఇందులో ఆమె భర్త దుష్యంతుడి పాత్ర కోసం మలయాళ హీరో దేవ్ మోహన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మాలీవుడ్‌లో అతడు పలు విజయవంతంమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు.

  ‘శాకుంతలం'లో వాళ్లంతా ఉంటారట

  ‘శాకుంతలం'లో వాళ్లంతా ఉంటారట

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘శాకుంతలం' సినిమాలో పలు సినీ పరిశ్రమలకు చెందిన స్టార్లు కీలక పాత్రలు పోషించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బాను ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నారని అంటున్నారు. అలాగే, మరికొందరు సీనియర్, జూనియర్ నటీనటులు కూడా ఇందులో కనిపిస్తారట. మరికొందరు గెస్టు పాత్రలు చేస్తారని సమాచారం.

  భారీ బడ్జెట్... సమంతకు ఎంతంటే

  భారీ బడ్జెట్... సమంతకు ఎంతంటే

  ‘శాకుంతలం' మూవీని గుణశేఖర్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటి కావడంతో దీనికి భారీ స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించారు. మొత్తంగా ఈ మూవీకి రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా సమంత ఈ చిత్రానికి 150 రోజులు డేట్స్ కేటాయించిందట. ఇందుకోసం ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకోనుందని తెలుస్తోంది.

  జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ప్రవేశం

  జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ప్రవేశం

  ‘శాకుంతలం' మూవీలో సమంతకు ఒక కొడుకు ‘భరత్' కూడా ఉంటాడు. ఆ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్‌ను తీసుకోబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే తారక్‌తో దీని గురించి చర్చలు కూడా జరిపారని సమాచారం. అన్నట్లు చిన్న ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసింది ఈ చిత్ర దర్శకుడు గుణశేఖరే.

  అల్లు అయాన్‌ కోసం ప్రయత్నాలు

  అల్లు అయాన్‌ కోసం ప్రయత్నాలు

  భారీ బడ్జెట్‌తో రాబోతున్న ‘శాకుంతలం' మూవీలో సమంత కుమారుడి పాత్ర కోసం అభయ్ రామ్ కాకపోతే.. అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడట గుణశేఖర్. గతంలో బన్నీతో అతడు ‘వరుడు', ‘రుద్రమదేవి' వంటి చిత్రాలు చేశాడు. ఈ సంబంధంతోనే అతడిని అడగాలని చూస్తున్నాడట. అంటే.. అభయ్, అయాన్‌లో ఒకరు ఇందులో ఉంటారన్న మాట.

  అల్లు అయాన్.. అభయ్ రామ్ ఇలా

  అల్లు అయాన్.. అభయ్ రామ్ ఇలా

  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల కుమారుడే అల్లు అయాన్. ప్రస్తుతం ఈ చిన్నోడి వయసు ఏడు సంవత్సరాలు. అయాన్‌ సోషల్ మీడియాలోనూ తరచూ కనిపిస్తాడు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి దంపతుల పెద్ద కుమారుడే అభయ్ రామ్. ప్రస్తుతం ఈ బుడ్డోడికి ఆరేళ్లు. ఈ చిన్నోడు బయట పెద్దగా కనిపించడు.

  English summary
  Gunasekhar Now Doing a mythological drama titled Shaakuntalam. Samantha plays the Title role in the movie. Abhay Ram Or Allu Ayaan To Play Key Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X