వెంకటేష్ సినిమాలో మరో హీరో.. టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న నట వారసుడు.!

By Manoj

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీల్లో రీమేక్‌ల హవా కనిపిస్తోంది. ఒక భాషలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను ఇతర భాషల్లోకి తీసుకెళ్లడానికి ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతున్నారు. ఇది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ విజయవంతమైన సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ చేయడం.. వేరే చోట వచ్చిన వాటిని ఇక్కడ రీమేక్ చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఓ సినీ కుటుంబానికి చెందిన వారసుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతకీ ఏంటా సినిమా..? ఎవరా వారసుడు..? పూర్తి వివరాల్లోకి వెళితే...

సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు

సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు

తమిళంలో సూపర్ స్టార్ ధనుష్ నటించిన చిత్రం ‘అసురన్'. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ధనుష్ కుర్రవాడిగా, మధ్య వయస్కుడి పాత్రలో కనిపించి మెప్పించ్చాడు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఎంతో మంది అనుకుంటే ఆయన ఫిక్స్ అయ్యాడు

ఎంతో మంది అనుకుంటే ఆయన ఫిక్స్ అయ్యాడు

ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడం సాహసంతో కూడుకున్న పనే. అందుకే రీమేక్ హక్కులు తీసుకున్న సురేష్ ప్రొడక్షన్స్.. దర్శకుడి విషయంలో మాత్రం చాలా కాలం క్లారిటీకి రాలేకపోయింది. ఈ క్రమంలోనే హను రాఘవపూడి, ప్రకాశ్ కోవెలమూడి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, దీనికి శ్రీకాంత్ అడ్డాలను ఫైనల్ చేశారు.

Recommended Video

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
వెంకటేష్ సహకారంతో మార్పులు

వెంకటేష్ సహకారంతో మార్పులు

తమిళంలో భారీ విజయం సాధించిన సినిమా కావడంతో తెలుగులోనూ అదే తరహా రిజల్ట్ తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథను మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేస్తున్నాడట. దీనికి హీరో వెంకటేష్ కూడా సహకారం అందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వెంకటేష్‌తో పాటు రానా కూడా

వెంకటేష్‌తో పాటు రానా కూడా

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. వెంకటేష్ నడి వయస్కుడిగా కనిపిస్తే.. అతడి కుమారుడిగా రానా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటికే రానా చేయాల్సిన సినిమాలు చాలా వరకు పెండింగ్‌లో ఉండడంతో అతడు ఈ పాత్రను చేయడం లేదన్న టాక్ కూడా వినిపించింది.

టాలీవుడ్‌లోకి మరో సినీ వారసుడు

టాలీవుడ్‌లోకి మరో సినీ వారసుడు

ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో అత్యంత కీలకమైన హీరో కుమారుడి పాత్ర కోసం దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్‌ను తీసుకోబోతున్నారట. వరుసకు బాబాయ్, అబ్బాయిలు అవడం వల్ల వీళ్ల మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రకటించినా.. కనిపించలేదు

ప్రకటించినా.. కనిపించలేదు

గతంలో దగ్గబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని పలుమార్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా అతడు క్రియేటివ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన ఓ సినిమాలో నటిస్తాడని అన్నారు. కానీ, అతడు మాత్రం ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. అయితే, సొంత ప్రొడక్షన్‌లో మాత్రం అభిరామ్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాలు దగ్గరుండి చూసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X