హిందీ ‘ఈగ’లో ఆ స్టార్ హీరో..?
దర్శకుడు రాజమౌళి రూపొందించిన గ్రాఫికల్ వండర్ చిత్రం 'ఈగ' అద్భుతమైన విజయం సాధించి సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకున్న 'ఈగ'ను త్వరలో హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమ చిత్రాన్ని అక్కడ 3డి వెర్షన్‌లో విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం 'ఈగ' హిందీ వెర్షన్లో సుదీప్, సమంత క్యారెక్టర్లు అలానే ఉంటాయని, అయితే నాని పోషించిన పాత్రకు మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారని, నాని పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా మొత్తాన్ని రీమేక్ చేయడమంటే చాలా పెద్ద పని కాబట్టి.....నాని నటించిన సీన్లను మాత్రం అభిషేక్‌తో రీషూట్ చేసి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది.
ఈగ చిత్రం జూలై 6న విడుదలై విజయవంతంగా మూడు వారాలకు చేరువైంది. విడుదలైన ప్రతి చోటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈచిత్రానికి నిర్మాత : సాయి కొర్రపాటి, సమర్పణ : డి సురేష్ బాబు, సంగీతం : కీరవాణి, కెమెరా : సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











