కికెటర్ యువరాజ్ సింగ్ జీవితంపై సినిమా వస్తోంది!

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య క్రీడాకారుల జీవితాలపై వస్తున్న సినిమాలకు బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ అభిస్తోంది. మిల్ఖా సింగ్ జీవితంపై వచ్చిన ‘భాగ్ మిల్ఖా భాగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించింది. అనంతరం మేరీ కోమ్ జీవితంపై వచ్చిన చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

త్వరలో క్రికెటర్ ధోనీ జీవితంపై కూడా ఓ సినిమా వస్తోంది. ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. ‘ఎంఎస్ ధోని' అనే టైటిల్ తో ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆ మధ్య ధోనీ భార్య సాక్షి స్వయంగా తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా విడుదల చేసింది.

Abhishek Bachchan to play Yuvraj Singh on screen?

త్వరలో మరో క్రికెటర్ జీవితంపై కూడా సినిమా రాబోతోంది. అతను మరెవరో కాదు....ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 2013లో వచ్చిన యువరాజ్ సింగ్ ఆటో బయోగ్రఫీ ‘టెస్ట్ ఆఫ్ మై లైఫ్' ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో యువరాజ్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకుని స్టార్ క్రికెటర్ గా ఎదిగిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. క్యాన్సర్‌ను జయించి మళ్లీ క్రికెట్లో నిలదొక్కుకున్న సంఘటనలు ఈ చిత్రంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X