అక్కడ పాగా వేయుటకు ‘అభి’షేక్ చేస్తున్న ప్రియమణి!
మణిరత్నం చిత్రంలో నటించే అవకాశం వస్తే చాలు ఎవరైనా తమ జన్మ ధన్యమయినట్టుగా భావిస్తారు. అటువంటి మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది..అందాల భామ ప్రియమణి. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ ను మలయాళీ ముద్దుగుమ్మ ప్రియమణి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలతో అభిషేకించేస్తోంది. మణిరత్నం రూపొందిస్తున్న 'రావణ్" లో నటిస్తున్న ప్రియమణి..అభిషేక్ మీద ఈ మధ్య ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
'అభిషేక్ సెట్ లో ఉన్నంత సేపు ఎంత సందడిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. అతను వేసే జోకులకు నవ్వీనవ్వీ ఒక్కోసారి కడుపు నొప్పి కూడా వస్తుందంటే నమ్మండి. అభిషేక్ సెట్లో ఉన్నాడంటే మనకు అలసట అనేది తెలియదు. ఒత్తిడి అన్నది దరిదాపుల్లో కూడా చేరదు" అంటూ అభిషేక్ ను ఆకాశానికెత్తేస్తోంది. ఈ చిత్రంలో నేను ఐశ్వర్యతో తెరను పంచుకోకపోయినా..అభిషేక్ తో మాత్రం కొన్ని సీన్స్ చేసాను. అవన్నీ నేను బాగా ఎంజాయ్ చేసాను" అని చెబుతున్న ప్రియమణి, కొన్నాళ్ల పాటయినా అభిషేక్ ను ఐశ్వర్యతో కలిసి పంచుకుంటె తప్ప వదిలేలా లేదని 'రావణ్" యూనిట్ వర్గాలు చెవులు కొరుకుంటున్నారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు అని మరికొందరు ఆరాతీస్తే.
త్రిష అక్షయ్ కుమార్ ని, అసిన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను, జెనీలియా షాహిద్ కపూర్ ని తమ వలలో వేసుకొని బాలీవుడ్ అవకాశాలను సొంతం చేసుకున్న విషయం తెలిసినదే..వారిని పరిశీలించిన ప్రియమణి ఇప్పుడు అభిషేక్ ను వలలో వేసుకుని బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుందట..అది విషయం.


Click it and Unblock the Notifications











