»   » బోయపాటితో సమస్యా లేక బెల్లంకొండతోనా, అసలు ఏం జరిగింది?

బోయపాటితో సమస్యా లేక బెల్లంకొండతోనా, అసలు ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : భారీ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించి, సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్న బోయపాటి శ్రీను టైమ్ బాగున్నట్లు లేదు. రీసెంట్ గా పోసాని ఆయన్ని బహిరంగంగా టీవిల్లో ఛీప్ మనిషంటూ ఆరేస్తే తాజాగా ఆయన సినిమాకు నిర్మాత మారిపోయి మరో ట్విస్ట్ వచ్చిపడింది.

సరైనోడు వంటి సూపర్ హిట్ తర్వాత మరో పెద్ద హీరో తో ముందుకు వెళ్తాడనుకుంటే...అంతకుముందు చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ తో ముందుకు వెళ్లాల్సిన పరిస్దితి వచ్చింది. పోనీ అదైనా సరిగ్గా వెళ్తోందా అంటే ముందు అనుకున్న నిర్మాత మారిపోయారు.

పంపిణీ రంగంలో విజయవంతంగా దూసుకెళుతున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ ఈ ప్రాజెక్టుని చేపట్టింది. తొలి ప్రయత్నంగా తమ సంస్థపై భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు సంస్థ అధినేత అభిషేక్. బోయపాటి దర్శకత్వంలో అభిషేక్ ఓ చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేసారు.

బోయపాటి నేను ఇంట్లో లేని సమయంలో వచ్చి అలా మాట్లాడాడు :పోసాని ఆగ్రహం

Abhishek Pictures out of Boyapati & Bellamkonda Srinu's movie

'అల్లుడు శ్రీను'తో మంచి మాస్ హీరో మెటీరియల్ అనిపించుకుని, ప్రస్తుతం 'స్పీడున్నోడు' చిత్రంలో చతికిలపడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నామనీ అభిషేక్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఇప్పుడాయిన ఈ సినిమాని నిర్మించటం లేదు. నవంబర్ నాలుగున అఫీషియల్ గా లాంచ్ అవుతుందనుకున్న ఈ చిత్రం నుంచి వద్దనుకుని వెనక్కి వెళ్లిపోయారు.

అందుకు కారణం బోయపాటి రెమ్యునేషన్ అని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో చేసిన 'సరైనోడు' సినిమాకు రూ.10 కోట్ల దాకా రెమ్యునేషన్ తీసుకున్నారు. అదే విధంగా ఈ సినిమాకు కూడా రెమ్యునేషన్ ని భారీగానే అడిగినట్లు సమాచారం.

దానికి తోడు తన గత సినిమాలాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నే ముందుకు వెళ్లాలని పట్టుపడ్డారట. కానీ వాస్తవానికి బెల్లంకొండ శ్రీనివాస్...స్పీడున్నోడు చిత్రం డిజాస్టర్ కావటంతో రూపాయి వెనక్కి రాలేదు. దాంతో అంత పెట్టుబడి పెట్టడానికి అభిషేక్ నామా ఆసక్తి చూపలేదట.

Abhishek Pictures out of Boyapati & Bellamkonda Srinu's movie

కానీ ఈ విషయంలో బెల్లంకొండ సురేష్ కూడా బోయపాటి వైపే ఉండి అంత బడ్జెట్ పెట్టి, బోయపాటికి ఆ రెమ్యునేషన్ ఇవ్వాల్సిందే అన్నారట. దాంతో కొత్తగా ప్రొడక్షన్లో అడుగుపెట్టి ఇలాంటి సమస్యలు ఫేస్ చేయడం ఎందుకని అభిషేక్ పిక్చర్స్ బయటికి వచ్చేసినట్లు సమాచారం. బోయపాటి ..హీరోకు తగినట్లు రెమ్యునేషన్ తగ్గించుకుని, బడ్జెట్ ని కంట్రోలు పెడితే ఈ సమస్య వచ్చేది కాదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

దాంతో బెల్లంకొండ మరో నిర్మాతను వెంటనే సెట్ చేసేసారట. 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాన్ని కోన వెంకట్‌తో కలిసి నిర్మిస్తున్న రవీందర్ రెడ్డి అనే కొత్త నిర్మాత చేతికి బోయపాటి-బెల్లంకొండ ప్రాజెక్టు అప్పచెప్పినట్లు సమాచారం.

English summary
Abhishek Pictures is no longer producing Boyapati movie, on the other hand Bellamkonda immediately found a replacement in the form of Miryala Ravinder Reddy as producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X