ఐశ్వర్య రాయ్ బర్త్‌డే ప్లాన్స్...
ముంబై: అందాల తార ఐశ్వర్య రాయ్ రేపు (నవంబర్ 1)న 39వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది. బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఐశ్యర్య ఈ బర్త్‌డేకు ఫ్యామిలీతో కలిసి గోవాలో ఎంజాయ్ చేయబోతోందట. ఐశ్వర్యకు ఇది చాలా స్పెషల్ బర్త్ డే. ఎందుకంటే తొలిసారిగా తన కూతురు ఆరాధ్యతో కలిసి తన పుట్టినరోజు వేడుక జరుపుకోబోతోంది.
ప్రస్తుతం ధూమ్ 3 షూటింగులో భాగంగా అమెరికాలో ఉన్న అభిషేక్ బచ్చన్ ఈ రోజే ముంబై చేరుకున్నారు. బర్త్ డే సందర్భంగా భార్య ఐశ్వర్యకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతే కాదు గోవాలో రెండు రోజుల పాటు గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేస్తున్నాడట.
ఐశ్వర్య బచ్చన్ నవంబర్ 1వ తేది 1973వ సంవత్సరంలో జన్మించింది. తన నటనా జీవితాన్ని ప్రారంభించక పూర్వం, ఆమె ఒక మోడల్ గా పనిచేసినది మరియు గా 1994లో విశ్వ సుందరి కిరీటాన్ని జయించిన తర్వాత పాపులర్ అయింది. తొలుత వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ లతో ప్రేమాయణం కొనసాగించిన ఐశ్వర్య రాయ్.... వారితో విడిపోయిన తర్వాత తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది. వారికి గత సంవత్సరం 'ఆరాధ్య' జన్మించింది.
సినీ జీవిత విశేషాల్లోకి వెళితే... మణిరత్నం దర్శకత్వంలో 1997లో వచ్చిన తమిళ చిత్రం 'ఇరువర్' ద్వారా ఐశ్వర్య రాయ్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఐశ్వర్య రాయ్ కెరీర్లో తొలి కమర్షియల్ హిట్ 1998లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం జీన్స్. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో 1999లో వచ్చిన 'హమ్ దిల్ దే చుకే సనం' అనే చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన ఐశ్వర్య ఆ తర్వాత తన హవా కొనసాగించింది.


Click it and Unblock the Notifications











