twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వేదం' లో అల్లు అర్జున్ లవ్ ట్రాక్ (స్పెషల్)

    By Srikanya
    |

    క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'వేదం' చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర కేబుల్ రాజు అన్న సంగతి తెలిసిందే. అయితే అతనికి సినిమాలో ఓ లవ్ ట్రాక్ ఉంటుంది. కేబుల్ కలెక్షన్స్ ఇచ్చుకునే అతను స్లమ్ కుర్రాడులో మిడిల్ క్లాస్ వ్యవహారం. అయితే రాజు ఓ డబ్బున్న అమ్మాయి (దీక్షా సేధ్) తో ప్రేమలో పడతాడు. మాస్ ఏరియా కుర్రాడైన అల్లు అర్జున్ ఆమె వెనక పడుతూ ఎట్రాక్ట్ చేయటానికి ఓ మల్టి మిలియనీర్ కొడుకుని అని బిల్డప్ ఇస్తూంటాడు. ఆ తర్వాత ఆమె కోసం అతను ఓ నెక్లెస్ ప్రెజెంట్ చేద్దామనుకుంటాడు. అయితే స్లమ్ లో ఉండే తన దగ్గర డబ్బు లేకపోవటంతో దొంగతనానికి రెడీ అవుతాడు. అయితే అనుకోకుండా బస్ స్టాప్ దగ్గర నుంచున్న ఆమె ఆమెనుండే దొంగలించబోతాడు. అయితే లక్కీగా తప్పించుకుంటాడు.

    ఆ తర్వాత ఆమె అతన్ని న్యూ ఇయిర్ కి పబ్ కు అటెండవటానికి టిక్కెట్ అడుగుతుంది. దాదాపు ఇరవై వేలు వరకూ ఉండే ఆ టిక్కట్టు కోసం అతను మరో దొంగతనానికి బయిలుదేరతాడు. అక్కడ ఏం జరుగుతుంది. అతను ఎలా రియలైజ్ అయ్యాడన్నది మిగతా కథ అని వినపడుతోంది. దాదాపు నలభై నిముషాల వరకూ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. ఇక దీక్షా సేధ్ మిస్ ఇండియా-2009(ఫాంటలూమ్స్ ఫెమీనాప్రెష్ పేస్)గా ఎంపికైంది. వేదం చిత్రంలో ఆమె ఓ డబ్బున్న అమ్మాయిగా చేస్తోంది. ఫన్నీగా సాగే ఈ ఎపిసోడ్స్ వైజాగ్ లో షూటింగ్ చేసారు. పదిహేను నిముషాలు పాటు సాగే ఈ పాత్రలో ఆమె సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం రేపు(జూన్ 4వ తేది) రిలీజ్ అవుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X