'బిజినెస్ మ్యాన్' సెన్సార్ టాక్ ఏంటి?
మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ జనవరి 11 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రం చూసి చాలా ఎంజాయ్ చేసారని, ముఖ్యంగా చిత్రంలో ఉన్న నాలుగు యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ గా నిలుస్తాయని చెప్పినట్లు సమాచారం. ఇక ఇప్పటికే హిట్టైన పాటలు కూడా సినిమాలో బాగా చిత్రీకరించారని,పూరీ ఈ చిత్రాన్ని పోకిరి ని మించి హిట్ కొట్టేలా తీసారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం రెండు గంటల ఎనిమిది నిముషాలు మాత్రమే లెంగ్త్ కలిగి ఉంది. కొన్ని మైనర్ కట్స్ తో సెన్సార్ వారు ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక నేరం కూడా ఇతర వ్యాపారం లాంటిదేనని భావించే గ్యాంగ్‌స్టర్ కథే 'ద బిజినెస్‌మ్యాస్'.
చిత్రంలో మహేష్ బాబు సూర్య అనే పాత్రలో కనిపిస్తాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన 'కంపెనీ'లోని గ్యాంగ్‌స్టర్ల మధ్య పోరాటాలు, పూరి రూపొందించిన 'పోకిరి'లోని వినోదం..రెండూ ఈ సినిమాలో కనిపిస్తాయి. మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, కో డైరెక్టర్: విజయ ప్రసాద్.


Click it and Unblock the Notifications











