వినాయిక్ చిత్రంపై ఇది రూమరా? నిజమా?
బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేసి తన కొడుకుని నిలబెట్టాలనే ఆలోచనతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా... ఇప్పటికే ఓకే అనుకున్న కథలు రెండు మూడు చివరి స్టేజీలో రిజెక్టు చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్టుపై పరుచూరి బ్రదర్శ్ కుస్తీ పడుతున్నారని వినపడుతోంది.
పరుచూరి బ్రదర్శ్ ఇప్పటికే చాలా కథలు వినాయిక్ కి చెప్పాడని, అయితే వినాయిక్ కి ఏదీ నచ్చటం లేదని, మరీ ఓల్డ్ గా ఆ కథలు ఉన్నాయని అందుకే రిజెక్టు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఆ మధ్యన కొత్త వారి దగ్గర నుంచి సైతం కథలు వినే ప్రయత్నం చేసాడు కానీ వర్కవుట్ కాలేదని సమాచారం.
బెల్లంకొండ సురేశ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్స్ ల్లో ఒకరైన సమంత నటిస్తుండటం విశేషం. కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు.
వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. నాయక్ చిత్రం తర్వాత వినాయిక్ చేస్తున్న చిత్రం ఇదే. వినాయిక్ మొదటి చిత్రం ఆది కి నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ మీదే చేయటంతో ఆ అనుబంధం ఇలా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications












