కృష్ణ వంశీ 'అంతపురం'సీక్వెల్ హీరో ఖరారు
కృష్ణ వంశీ కెరీర్ లో మంచి హిట్ నమోదు చేసిన చిత్రం అంతపురం. ఈ చిత్రాన్ని కృష్ణవంశీ సీక్వెల్ చేయటానకి సన్నాహాలు చేస్తున్నారు. సాయికుమార్ కుమారుడు ఆది ఇందులో హీరోగా చేయనున్నాడని సమాచారం. ఒరిజనల్ చిత్రంలో సాయికుమార్ చనిపోతాడు. అతని కుమారుడు మిగిలిపోతాడు. ఆ పాత్ర ఇప్పుడు పెరిగి పెద్దదై ఆదిగా మారుతుంది. సాయికుమార్ కొడుకు ఆది ప్రేమే కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు బి.జయ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో ఒరిజనల్ చిత్రంలో మిగలిన పాత్రలు ..ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్ర కంటిన్యూ అవుతుందని అంటున్నారు.
ఈ చిత్రంకు మార్కెట్లో మంచి క్రేజ్ వస్తుందని కృష్ణ వంశీ భావిస్తున్నారు.ఇక గోపీచంద్ తో రీసెంట్ గా చేసిన మొగుడు చిత్రం ఫ్లాఫ్ అవటంతో కృష్ణవంశీ ఈ సారి ఎలాగైనా మంచి హిట్ తో తనను తాను నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. సంప్రదాయాలు నేఫధ్యంలో మొగుడు,పెళ్లాల అనుబంధాలు నిర్వచిస్తూ చేద్దాముకున్న మొగుడు ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. దాంతో పూర్తిగా గత కొద్ది రోజులుగా ఆయన ఈ అంతపురం స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మిస్తారా..వేరే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనేది తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











