హాట్ టాపిక్ :మహేష్ సినిమా ఇప్పట్లో లేనట్లేనా?
ఇప్పటికీ ఈ చిత్రం కేవలం 30శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ ఇప్పటి వరకు తీసిన సినిమాను ఎడిట్ చేసుకుంటూ బిజీగా వుంటే, మరో పక్క ప్రిన్స్ మహేష్‌బాబు ఫ్యామిలీతో కలిసి సింగపూర్ రిసార్టుల్లో సేదతీరు వచ్చాడు. ఎండాకాలంలో పనిచేయడం మహేష్‌బాబుకు ఇష్టంలేకే ఈ చిత్రం షూటింగ్‌ని ఆపేసినట్లు సమాచారం.
ఈ వేసవిలో హైదరాబాద్ షెడ్యూల్ మొత్తం పూర్తి కావలసి వుంది. ఆ తర్వాత లండన్ వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు షూటింగ్‌ని జరపాల్సి వుంది. ఇదంతా సవ్యంగా జరిగితేనే సినిమా అనుకున్నట్లుగా ఆగస్టులో విడుదలయ్యేది. ప్రస్తుతం ఇక ఈ చిత్రం ఇప్పట్లో లేనట్లే అంటున్నారు పరిశ్రమలో. ప్రాజెక్టు మొత్తం మరో రెండు లేదా మూడు నెలలు వెనక్కి వెళ్లిపోయింది కాబట్టి సినిమా డిసెంబర్ లేదా జనవరిలో విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో క్రితి సానన్ హీరోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈచిత్రానికి టైటిల్ ఖరారు కానుంది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్


Click it and Unblock the Notifications












