ఢమురుకం లో నాగార్జున పాత్ర లోక రక్షకుడుగా ..
నాగార్జున,శ్రీనివాస రెడ్డి ల కాంబినేషన్ లో ఢమురుకం చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో అనూష్క క్యారెక్టర్ హైలెట్ గా ఉండనుందని తెలుస్తోంది.ఆమె చుట్టూనే కథ తిరుగుతుందని చెప్తున్నారు.ఆమె దైవాంస సంబూతురాలిగా పార్వతి అంశతో పుడుతుందని సమాచారం.కొన్ని దుష్ట శక్తులు ఆమె ద్వారా లబ్ది పొందటానకి చేసే ప్రయత్నం జరుగుతుందని,అది లోక వినాశనానికి దారి తీసే ప్రమాదం ఉంటుందని,నాగార్జున లోక రక్షకుడుగా,ఆమెను సేవ్ చేయటమే కాక అందరినీ రక్షించే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఇక ఫస్టాఫ్ లో కామిడీతో నడిచి ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి పూర్తిగా కథలో ప్రవేశిస్తాడని అంటున్నారు.అలాగే ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫైట్ సనిమాకు హైలెట్ గా ఉండబోతుందని అంటున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ బి.హెచ్.ఇయల్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.జూన్ ఆరవ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలైంది.అక్కడ ఉన్న బ్రమరాంబ మల్లికార్జున దేవాలయం వద్ద షూట్ చేస్తున్నారు.అనూష్క,బ్రహ్మాజీ పాల్గొనే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం నాగార్జున కెరీర్ లోనే హైయిస్ట్ బడ్జెట్ చిత్రంగా చెప్తున్నారు.దాదాపు యాభై నిముషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయని,అవే సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని వివరిస్తన్నారు.ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూంటే,ఛోటా కె నాయుడు కెమెరా వర్క్ చేస్తున్నారు.అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











