ముగ్గరు కొరియోగ్రాఫర్స్ తో ఎన్టీఆర్ సాంగ్
ఎన్టీఆర్ ఇప్పటికే మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు.కానీ మార్కెట్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కూడా మంచి పోటీ ఇస్తూండటంతో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, స్టెప్స్ తో ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది. తాజాగా జూ.ఎన్టీఆర్ చేస్తున్న ఊసరవెల్లి లో పాట కోసం ముగ్గురు కొరియోగ్రాఫర్స్ ని ఉపయోగించారని సమాచారం. సౌత్ ఇండస్ట్రీలోని ముగ్గురు కొరియోగ్రాఫర్స్ పనిచేసే ఈ పాట ట్రెండ్ సెట్టర్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఈ పాటలో క్లాసికల్, వెస్ట్రన్, రీమిక్స్ మూడూ చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. ఒక్కో కొరియోగ్రాఫర్ తన నైపుణ్యంతో ఈ తనకు అప్పగించిన బిట్ ని అద్బుతం చేసి ఈ ప్రయోగంలో టాప్ అనిపించుకోవాలని కష్టపడుతున్నట్లు బయిట వినిపిస్తోంది. ఇక ఊసరవెల్లి చిత్రాన్ని దర్శకుడు సురేంద్రరెడ్డి డైరక్ట్ చేస్తున్నారు. తమన్నా..ఎన్టీఆర్ సరసన చేస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అశోక్ తర్వాత ఎన్టీఆర్,సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











