»   » పవన్ పార్టీ ఆఫీస్ ఎక్కడ?

పవన్ పార్టీ ఆఫీస్ ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
About Pawan Kalyan' Party Office
హైదరాబాద్ : జనసేన పార్టీ కోసం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 10వ తేదీన ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకొన్నట్లు తెలిసింది. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో తను నివసిస్తున్న ఇంటిని చిరునామాగా అందులో పేర్కొన్నారు. మార్చి 3వ తేదీని కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు అందులో తెలిపారు. పవన్‌ ఈ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

కార్యదర్శి, కోశాధికారి, మరో ముగ్గురు కార్యవర్గ సభ్యులుగా వ్యవహరిస్తారని ఎన్నికల సంఘానికి తెలిపారు. అయితే ప్రస్తుతం చెప్పిన చిరునామాలో పార్టీ కార్యాలయం ఉండకపోవచ్చని సమాచారం. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ పరిసరాల్లో విశాలమైన ప్రాంగణంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని స్థలాల్నీ, భవనాల్నీ పరిశీలించినట్లు తెలిసింది.

పవన్‌కల్యాణ్‌ రాజకీయ తెరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. ముహూర్తం శుక్రవారం రాత్రి. 'జనసేన' పేరుతో తను ప్రారంభించే పార్టీ సిద్ధాంతాలనీ, తన రాజకీయ ఆలోచనల్నీ ఈ రోజు అభిమానుల సమక్షంలో వెల్లడించబోతున్నారు. ఎందుకోసం పార్టీని నెలకొల్పుతున్నదీ స్పష్టం చేయబోతున్నారు. పార్టీ ఆవిర్భావ సమావేశానికి హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) ఆవరణలోని నోవాటెల్‌ హోటల్‌ను వేదికగా ఎంచుకొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవన్‌ ప్రసంగం చూసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఎంపిక చేసిన ఆరువేల మంది అభిమానులను ఆహ్వానించినట్లు తెలిసింది. వీరందరికీ ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు. రాజకీయ నాయకులకీ, సినీ ప్రముఖులకీ ఎలాంటి ఆహ్వానాలు అందలేదని సమాచారం. ఇప్పటికే నోవాటెల్‌ ప్రాంగణంలో పవన్‌ పార్టీ వర్గాలు ఏర్పాట్లను చురుగ్గా సాగిస్తున్నాయి.

English summary
Pawan Kalyan's new Party 'Jana Sena' Launch to be held today. The event is expected to start around 8 PM in the 5-Star Novotel Hotel, Hitex, Madhapur, Hyderabad. Its strictly by invite Only event for Media & few selected Pawan Fans with 'Bar Code' Pass system in place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu