»   » పవన్ రాజకీయ ప్రసంగం లో ఏం మాట్లాడతారు?

పవన్ రాజకీయ ప్రసంగం లో ఏం మాట్లాడతారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
About Pawan's Political Speech?
హైదరాబాద్ : ఈ నెల 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో పవన్‌కల్యాణ్ తన రాజకీయ అరంగేట్ర సభను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ ఏం మాట్లాడబోతున్నారనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమంగా మారింది. పవన్‌కల్యాణ్ ప్రసంగం రాజకీయాల్లో ప్రకంపన లు సృష్టించే రీతిలో వుంటుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. అయితే పవన్ తన ప్రసంగంలో ఏయే అంశాల్ని ప్రస్తావించబోతున్నారు?

పవన్ తన సినీ భవిష్యత్తు గురించి ఆయన ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారు? సినిమాలకు స్వస్ధి చెప్పి పూర్తిస్థాయి రాజకీయరంగంలోనే కొనసాగుతారా? అనే ప్రశ్నలకు పవన్‌కల్యాణ్ సమాధానమేమిటని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పరిశ్రమలో చెప్పుకోబడుతున్న దాని ప్రకారం ప్రస్తుతం వున్న రాజకీయ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తాను ఏ విధంగా పరిష్కరించగలడనే అంశంపైనే పవన్‌కల్యాణ్ ప్రసంగం వుండబోతోందని తెలుస్తోంది.

దాదాపు 45నిమిషాల పాటు ఆయన ప్రసంగం వుంటుందని, అందులో పలు సంచలన నిర్ణయాల్ని వెలువరిస్తారని అభిమానులు అంటున్నారు. ఈ సభలోనే పార్టీ తరపున పోటీ చేయబోయే 40మంది అసెంబ్లీ అభ్యర్థులు, 9మంది పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పవన్‌కల్యాణ్ ఒక్కరే ప్రసంగిస్తారని మీడియా వారితో ఎటువంటి ముఖాముఖి వుండదని తెలుస్తోంది. ఈ సభలో పార్టీ విధివిధానాలను ప్రకటించడంతో పాటు ప్రపంచ సామాజిక, రాజకీయాంశాలపై పవన్‌కల్యాణ్ రాసిన పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. మూడువేల మంది అభిమానులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.

మరో ప్రక్క పవన్‌ కళ్యాణ్‌ కూడా బడుగులకు భారీగా తాయిలాలను ప్రకటించనున్నారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనున్నట్లు పవర్‌స్టార్‌ వర్టీయులంటున్నారు.అదే విధంగా దాదాపు ఇరవై శాతం దాకా ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్‌కళ్యాణ్‌ పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ పద్దతిలో వ్యవహరిస్తే పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రంలో నూతన ఒరవడి ని సృష్టిస్తారనే వ్యాఖ్య రాజకీయవర్గాలలో వుంది. తెలంగాణ ప్రాంతంలో బీసీతో పాటు దళిత కార్డును వాడాలని పవర్‌స్టార్‌ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

English summary
Pawan Kalyan is going to hold his first press event regarding to political entry will be held on the evening of 14 March at HITEX, Madhapur. He will speak for an hour between 6 pm to 7 pm. He will also introduce his core team which consists of several famous names who never contested in elections so far. The candidates he is going to field will be several ex-bureaucrats and entrepreneurs with social awareness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu