పాలిటిక్స్,కరప్షన్ అంశాలతోనే పవన్ కళ్యాణ్ కథ?

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, రచ్చ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ ఖరారైన సంగతి తెలసిందే. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈచిత్రాన్ని ప్రస్తుత రాజకీయాలు, అవినీతిని ఫోకస్ చేస్తూ రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవి నిజమేనని అంటున్నారు. ఈ చిత్రంలో పవన్ అవినీతి రాజకీయనాయకుల మీద యుద్దం ప్రకటిస్తాడని అంటున్ననారు. పవన్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ అంశాలను కలగలిపి వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారు.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. హీరోయిన్... ఇతర సాంకేతిక వర్గం వివరాలు ఖరారు కావాల్సి ఉంది. ఈ చిత్రానికి 'చోటా మేస్త్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రచ్చ దర్శకుడుతో ఆయన చేయబోయే చిత్రం మే నుంచి ప్రారంభం కానుంది. రీసెంట్ గా స్క్రిప్టుని ఫైనల్ చేసి లాక్ చేసిన పవన్... ప్రీ ప్రొడక్షన్ చేసుకోమని అనుమతి ఇచ్చారని తెలుస్తోంది.

పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. NTV ఛానెల్ సి.ఈ.ఓ గా చేస్తున్న శరత్ మరార్ నిర్మతగా కొత్త చిత్రం తెరకెక్కనుందని సమాచారం. చాలా కాలంగా వీరిద్దరూ మంచి స్నేహితులు కావటంతో ఈ అవకాసం శరత్ మరార్ కి ఇచ్చినట్లు సమాచారం. శరద్ మరార్ గతంలో మా టీవికి సి.ఈ.ఓ గా చేసారు. ఆయన కెరీర్ ..అమితాబ్ కు చెందిన ఎబిసిఎల్ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ గా మొదలెట్టారు.

మరో ప్రక్క శరత్ మరార్... చిత్ర సీమ అనే కొత్త ఛానెల్ ని NTV ఆధ్వర్యంలో మొదలు పెట్టానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సభ్యులైన కొందరు నిర్మాతలు ఈ ఛానెల్ లో భాగస్వాములుగా ఉండి మరీ ఈ ఛానెల్ ని తెస్తున్నారని తెలుస్తోంది. శరద్ మరార్ గతంలో మాటీవిలోనూ మంచి రేటింగ్స్ తెచ్చారని, ఇప్పుడు ఈ కొత్త తెలుగు సినీ ఛానెల్ ను కూడా ఆయన నిలబడతారని భావిస్తున్నారు. ఇక శరద్ మరార్ కి మొదటి నుంచీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నాయి. పవన్ స్నేహితుడుగానే కాకుండా ఆయన పరిశ్రమ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X