For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సునీల్ సినిమాకు ఆ టైటిల్ ఎలా పెడతారు?

  By Srikanya
  |

  హైదరాబాద్: సునీల్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘జోష్' ఫేం వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘మలుపు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు మీడియాలో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వార్తలు వస్తున్నాయి. అయితే రవిరాజా పినిశెట్టి తనయుడు సత్య ప్రభాస్‌ పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రానికి 'మలుపు' అనే టైటిల్ ని పెట్టారు. ఆదర్శ చిత్రాలయ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై రవిరాజా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ టైటిల్ ఫిక్సై, ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం టైటిల్ ని ...ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న చిత్రానికి ఎలా పెడతారనేది ఆసక్తికరమైన విషయం.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  సునీల్ సరసన నిక్కి గార్లని హీరోయిన్ గా నటిస్తుంది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమాకు కోన వెంకట్, గోపి మోహన్ రచనా సహకారం అందిస్తున్నారు. దినేష్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. సునీల్ కెరీర్లో ‘మర్యాద రామన్న' బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ ఈ సినిమాతో అందుకుంటాడు అనే ధీమాను నిర్మాత వ్యక్తం చేస్తున్నారు.

  చిత్రం విశేషాలకు వస్తే..

   About Sunil, Dil Raju movie title

  ఇంతకీ హీరోయిన్ నిక్కి గార్లని మరెవరో కాదు... ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' ఫేం సంజన సోదరి నిక్కి గార్లని. ఆమెను సునీల్ సరసన హీరోయిన్‌గా ఎంపిక చేసారు. తమిళ మరియు కన్నడ చిత్రాలలో నటించిన నిక్కి గార్లనికి తెలుగులో ఇదే మొదటి సినిమా. తెలుగులో హిట్టైన ‘ప్రేమకథా చిత్రమ్' తమిళ రీమేక్ ‘డార్లింగ్'లో నిక్కి నటన చూసి నచ్చిన దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చారు.

  ఇక సునీల్ హీరోగా ‘జోష్' ఫేం వాసు వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం ఆ మధ్యన ప్రారంభమైంది. దిల్ రాజు మాట్లాడుతూ... వాసు వర్మ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. జోష్ సినిమాతో వాసు వర్మను దర్శకుడిగా పరిచయం చేశాం. ఆ సినిమా మేం ఆశించిన విజయం సాదించలేదు. ఈ సినిమా అతని టాలెంట్ ప్రూవ్ చేసుకునే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. విలువలతో కూడిన వినోదాత్మక సినిమా. కోన చక్కని కథను రెడీ చేశారు. త్వరలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

  నా కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచే సినిమా అవుతుందని భావిస్తున్నాను. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది అని సునీల్ అన్నారు. నా టాలెంట్ పై నమ్మకం ఉంచిన దిల్ రాజు, సునీల్ గార్లకు థాంక్స్ అని దర్శకుడు వారు వర్మ అన్నారు. ఈ సినిమా ద్వారా దినేష్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కోన వెంకట్ రచయితగా పని చేస్తున్న ఈ సినిమాకు దినేష్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

  మిస్టర్ పెళ్లి కొడుకు, భీమవరం బుల్లోడు చిత్రాల పరాజయం తర్వాత సునీల్ మరో చిత్రం ఒప్పుకున్నట్లు ఎక్కడా కనపడలేదు. అప్పుడప్పుడూ ఆ దర్శకుడుతో, ఈ నిర్మాతతో...ఫలానా బ్యానర్ లో అని వార్తలు వచ్చినా అవేమీ ముందుకు వెళ్లినట్లు కనపడలేదు. కష్టపడి సిక్స్ ప్యాక్ చేసిన తర్వాత సునీల్ కు సరైన స్క్రిప్టు ఒక్కటీ కనపడలేదు. అందాలు రాముడు, మర్యాద రామన్న రేంజి హిట్ ఒక్కటి అతని కెరీర్ లో రాలేదు. పూలరంగడు బాగా ఆడినా అతనికి పెద్ద ప్లస్ కాలేకపోయింది. ఇవన్నీ ప్రక్కన పెడితే సునీల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

  English summary
  Long back ago Dil Raju – Sunil Movie launched on August month, The movie salted for so many reasons, After a long break Dil raju – sunil – vasu varma movies starts again, From past couple of days action scenes are under making.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X